Advertisementt

పవన్‌ ఫ్యాన్స్‌ను హర్ట్ చేసిన అల్లు అర్జున్!

Wed 08th Jan 2020 04:16 PM
bunny hurts,allu arjun,pawan kalyan,pawan fans,ala vaikunthapurramuloo  పవన్‌ ఫ్యాన్స్‌ను హర్ట్ చేసిన అల్లు అర్జున్!
Bunny Hurts Pawan Kalyan Fans In.. Ala Vaikunthapurramuloo Function పవన్‌ ఫ్యాన్స్‌ను హర్ట్ చేసిన అల్లు అర్జున్!
Advertisement
Ads by CJ

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే నటీనటులుగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన చిత్రం ‘అల వైకుంఠపురములో..’.  ఈ సినిమా జనవరి-12న థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ పరంగా దూసుకెళ్తున్న చిత్రబృందం తాజాగా.. మ్యూజికల్ కాన్‌సర్ట్ పేరుతో గ్రాండ్‌గా ఈవెంట్ నిర్వహించింది. ఈ ఈవెంట్‌కు హైదరాబాద్‌లోని యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్‌ వేదికైంది. ఈ వేడుకను తిలకించడానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాదు.. పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున మెగాభిమానులు, బన్నీ వీరాభిమానులు తరలివచ్చారు. అయితే ఈ కార్యక్రమానికి వచ్చిన పవర్‌స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్, మెగాభినులు చాలా హర్ట్ అయ్యారు. అసలేం జరిగింది..? ఎందుకు హర్ట్ అయ్యారనే విషయాలు www.cinejosh.com అందిస్తున్న ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.

అందరీ గురించి బాగా మాట్లాడి..!

కార్యక్రమంలో భాగంగా.. ‘అల వైకుంఠపురములో’ నటించిన నటీనటులు, దర్శక నిర్మాతలు అందరూ చాలా చక్కగా మాట్లాడారు. అయితే.. చివరిన మాట్లాడిన అల్లు అర్జున్ మాత్రం మిగిలిన నటీనటుల మాదిరిగా మాట్లాడుతూ మేనేజ్ చేయలేకపోయాడని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో మెగాభిమానులు, మరీ ముఖ్యంగా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. బన్నీ మాట్లాడుతుండగా.. పవన్.. జై పవన్.. జైజై పవన్ అంటూ ఆయన ఫ్యాన్స్ పెద్ద ఎత్తున నినాదాలతో హోరెత్తించారు. బన్నీ.. ప్లీజ్ ఒక్కసారి పవన్ గురించి మాట్లాడండి.. అంటూ కేకలేశారు. ఈ క్రమంలో మీ కోసం ‘పవన్’ అంటానని ఒక్కసారి అనేసి అసహనంతో మిన్నకుండిపోయాడు అల్లుఅర్జున్. ఆ తర్వాత యథావిథిగా తన ప్రసంగాన్ని చిరంజీవి, రజనీకాంత్, సంక్రాంతికి విడుదల కానున్న సినిమాల గురించి చెబుతూ ముగించాడు. అంటీ ముంటన్నట్లుగా పవన్ గురించి మాట్లాడుతున్నారేంటి..? అని ఫ్యాన్స్ బాగా హర్టయ్యారట.

ఏ మాత్రం సక్సెస్ చేస్తారో!?

వాస్తవానికి పవన్‌-బన్నీకి పడదని అప్పట్లో వార్తలు వచ్చినప్పటికీ ఫిల్మ్ చాంబర్‌లో ఇద్దరూ కౌగిలించుకోవడం.. ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలో అల్లు అర్జున్ పాల్గొనడంతో అబ్బే అదేం లేదని తేలిపోయింది. అయితే మళ్లీ మధ్యలో ఏం జరిగిందో ఏమోగానీ మళ్లీ.. పవన్ ఫ్యాన్స్ వర్సెస్ బన్నీ ఫ్యాన్స్‌గా నెట్టింట్లో వాతావరణం నెలకొంది. ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శల వర్షం కురిపించుకుంటున్నారు. మరోవైపు బన్నీని పవన్ ఫ్యాన్స్‌ గట్టిగా ట్రోల్ చేస్తూ.. ట్రైలర్‌కు డిస్‌లైక్స్, ఇష్టానుసారం కామెంట్స్ చేస్తున్నారు. అయితే డిస్‌లైక్, కామెంట్స్ చేస్తున్న వారంతా పవన్ ఫ్యాన్స్ అనీ ప్రత్యేకించి చెప్పలేం. మరి ఫ్యాన్స్ మధ్య వార్‌కు ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుందో..? ఈ వ్యవహారంపై అటు పవన్ నుంచి గానీ.. లేదా బన్నీ నుంచి గానీ రియాక్షన్ వస్తుందో లేదో..? మెగాభిమానులు ‘అల వైకుంఠపురములో’ సినిమాను ఏ మాత్రం సక్సెస్ చేస్తారో తెలియాలంటే సంక్రాంతి పండుగ వరకు వేచి చూడాల్సిందే.

Bunny Hurts Pawan Kalyan Fans In.. Ala Vaikunthapurramuloo Function:

Bunny Hurts Pawan Kalyan Fans In.. Ala Vaikunthapurramuloo Function

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ