Advertisementt

విజయ్ ‘ఫైటర్’ కోసం స్పెషల్ మేకోవర్?

Wed 08th Jan 2020 03:40 PM
special make over,,vijay devarakonda,fighter,puri jagannadh  విజయ్ ‘ఫైటర్’ కోసం స్పెషల్ మేకోవర్?
Special Make Over For Vijay Devarakonda Fighter విజయ్ ‘ఫైటర్’ కోసం స్పెషల్ మేకోవర్?
Advertisement
Ads by CJ

విజయ్ దేవరకొండ వరల్డ్ ఫెమస్ లవర్ కోసం అర్జున్ రెడ్డి స్టయిల్లో గెడ్డం హెయిర్ స్టయిల్ మార్చేసాడు. విజయ్ దేవరకొండ నిన్నటివరకు గుబురు హెయిర్ తోనే కనిపించాడు. అయితే పూరి జగన్నాధ్ సినిమా కోసం విజయ్ దేవరకొండ ఫైటర్ లుక్ లోకి మారాలంటే స్పెషల్ మేకోవర్ కావాలి. అందుకే విజయ్ దేవరకొండ ఇప్పుడు ముంబై లో ప్రత్యక్షమయ్యాడు. పూరి జగన్నాధ్ - ఛార్మీల తో కలిసి లుక్ టెస్ట్ కోసం విజయ్ దేవరకొండ ముంబై వెళ్ళాడు. అక్కడ ప్రముఖ స్టైలిస్ట్ తో హెయిర్ స్టయిల్ అండ్ స్టైలిష్... ఇంకా విజయ్ లుక్ లో మార్పులు చేర్పులు చేయించుకున్నాడు.

ఈ విషయాన్నీ ఛార్మి స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. పూరి జగన్నాధ్ సమక్షంలో ప్రముఖ బాలీవుడ్ స్టైలిస్ట్ అలీం హకీమ్ దగ్గర విజయ్ దేవరకొండ స్టైలింగ్ అండ్ లుక్ టెస్ట్ కి సిద్దమవుతున్నాడని తెలిపింది. మా ఫైటర్ న్యూ లుక్ అదిరింది అని చెప్పడమే కాదు... ఛార్మి కూడా అక్కడే ఉండి ఫొటోస్ కూడా తీయించుకుంది. ఇక విజయ్ దేవరకొండ ఫైటర్ కోసం బాక్సర్ గా మారబోతున్నాడు. ఈ ఫైటర్ సినిమా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కడంతో.. విజయ్ దేవరకొండ లుక్ లో చాలా మార్పులు చేర్పులు చెయ్యాల్సి ఉంది. అందుకే విజయ్ ప్రస్తుతం లుక్ టెస్ట్ కోసం ముంబైలోనే మకాం పెట్టాడు.

Special Make Over For Vijay Devarakonda Fighter:

Special Make Over For Vijay Devarakonda Fighter  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ