అల్లు అర్జున్ నా పేరు సూర్య తర్వాత లాంగ్ గ్యాప్ తో అల వైకుంఠపురములో సినిమా చేసాడు. ఆ సినిమాలో బన్నీ లుక్ ఎలా ఉండబోతుందో ఆ సినిమా పోస్టర్స్ తోనూ, ట్రైలర్ తోనూ ఫుల్ క్లారిటీ వచ్చేసింది. కాస్త హెయిర్ పెంచి సాదాసీదా లుక్ లోనే బన్నీ తన ఫేస్ ఎక్సప్రెషన్స్ తో.. అన్ని నిజాలే చెప్పే స్వచ్ఛమైన కుర్రాడిగా కనబడుతున్నాడు. ఇక అల వైకున్టపురములో హడావిడి మరో నాలుగైదు రోజుల్లో ముగిసిపోతుంది. తర్వాత బన్నీ సుకుమార్ సినిమా కోసం రెడీ కావాలి. ఇప్పటికే సుకుమార్ బన్నీ లేకుండానే సినిమా షూటింగ్ మొదలెట్టేసాడు. కేరళలో జలపాతాల వద్ద కొన్ని సన్నివేశాలు షూట్ కూడా చేసి.. బన్నీ రాక కోసం వెయిట్ చేస్తున్నాడు.
అయితే అల్లు అర్జున్ అప్పుడే సుకుమార్ సినిమా కోసం మేకోవర్ అవడం మొదలెట్టాడనిపిస్తుంది. నిన్న రాత్రి జరిగిన అల వైకుంఠపురములో మ్యూజికల్ నైట్ లో అల్లు అర్జున్ హెయిర్ పెంచి, కాస్త గెడ్డం పెంచాడు. మరా లుక్ చూస్తుంటే సుక్కు సినిమా కోసం బన్నీ ప్రిపరేషన్ స్టార్ట్ అయ్యిందనిపిస్తుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాగ్డ్రాప్ లో ఉండబోయే ఈ కథలో అల్లు అర్జున్ 20 యేళ్ల క్రితం చిత్తూరు ప్రాంతానికి చెందిన కుర్రాడిగా.... కాస్ట్యూమ్స్ పరంగాను చాల డిఫరెంట్ గా కొత్తగా కనిపిస్తాడని చెబుతున్నారు. అలాగే అల్లు అర్జున్ పాత్రలో నెగెటివ్ షేడ్స్ ఉంటాయనీ, కొంతసేపు స్మగ్లర్ గాను కనిపిస్తాడని ఫిలింనగర్ టాక్ అందుకే సుక్కు తో షూటింగ్ కి జాయిన్ అయ్యే సమయానికి మరికాస్త గెడ్డం పెంచేసి అదే లుక్ తో అల్లు అర్జున్ కనిపిస్తాడని టాక్.