Advertisementt

విజయశాంతిని మ్యాచ్ చేయలేని టబు?

Tue 07th Jan 2020 06:32 PM
sr actress tabu,vijayasanthi,sarileru neekevvaru,ala vaikunthapurramuloo  విజయశాంతిని మ్యాచ్ చేయలేని టబు?
Sr Actress Tabu Didnt Match Vijayasanthi విజయశాంతిని మ్యాచ్ చేయలేని టబు?
Advertisement
Ads by CJ

కృష్ణ గారితో సినిమాల్లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన విజయశాంతి మళ్ళీ కృష్ణ కొడుకు మహేష్ బాబు తో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతుంది. సరిలేరు నీకెవ్వరూ సినిమాలో విజయశాంతి ఓ పవర్ ఫుల్ రోల్ చేస్తుంది. అయితే సరిలేరు ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజున మీ నాన్నగారితో ఎంట్రీ ఇచ్చా... మళ్ళీ మీతో రీ ఎంట్రీ ఇస్తున్నా.. మీ  అబ్బాయితో కూడా నటిస్తే  త్రీ జెనరేషన్ తో నటించనదానిగా మిగులుతా అంటూ విజయశాంతి మహేష్ ని ఉద్దేశించి ఫన్నీ కామెంట్స్ చేసింది. ఇక సరిలేరు నీకెవ్వరూ సినిమాలో విజయశాంతి లుక్స్, ఆమె స్టయిల్ అన్ని హీరో మాదిరిగా కనబడుతున్నాయి. అలాగే సినిమాలో బాగా పవర్ ఫుల్ పాత్ర చెయ్యడమే కాదు.. ఆమెకి మంచి పాత్ర ఆ సినిమాతో అని రావిపూడి రాసాడు.. కాబట్టే ఆమె రీ ఎంట్రీ కి ఒప్పుకుంది. అలాగే విజాశాంతిని ఎలా హైలెట్ చెయ్యాలో చేస్తూ సరిలేరు టీం ఆమె తో పబ్లిసిటీ చేపించుకుంటుంది. అయితే అదే టైం లో తెలుగులోకి మరో సీనియర్ హీరోయిన్ రీ ఎంట్రీ ఇచ్చింది.

బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ టబు అల వైకుంఠపురములో సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. నాగార్జున, వెంకటేష్, చిరు, బాలయ్య లతో హీరోయిన్ గా నటించిన టబు అల్లు అర్జున్ అల వైకుంఠంలో ఓ ముఖ్యపాత్ర పోషించింది. అయితే టబు లుక్స్ కానీ, ఆమె పాత్ర కానీ విజయశాంతి లుక్స్ తో, ఆమె పాత్రతో మ్యాచ్ అవడం లేదు. మాములుగా త్రివిక్రమ్ సినిమాల్లో సీనియర్ హీరోయిన్స్ కి కీలక పాత్రలుంటాయి. కానీ అల ట్రైలర్ లో టబు ని చూస్తే మాత్రం ఆలా అనిపించడం లేదు. అంత ఎక్కే పాత్ర కాదనిపిస్తుంది. కాస్త గ్లామరస్ గా కనిపిస్తున్నప్పటికీ... టబు మాత్రం విజాశాంతి తో మ్యాచ్ కావడం లేదు. ఇక సరిలేరు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విజయశాంతి ఎంత హైలెట్ అయ్యిందో.. చూసాం. కానీ గత రాత్రి అల వైకుంఠపురములో మ్యూజికల్ కాన్సెర్ట్ లో టబు అంత హైలెట్ అయినట్లుగా అనిపించలేదు. ఎలా లేదన్నా విజయశాంతి ముందు టబు తేలిపోయిందనే చెప్పాలి. 

Sr Actress Tabu Didnt Match Vijayasanthi:

Sr Actress Tabu Didnt Match Vijayasanthi  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ