ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> NTR-2020 Calender Released Nandamuri Mohana Krishna

ఎన్టీఆర్- 2020 క్యాలెండర్ ఆవిష్కరణ

NTR-2020 Calender Released Nandamuri Mohana Krishna

నందమూరి మోహన కృష్ణ మహానటుడు, పద్మశ్రీ ఎన్ .టి .రామారావు 2020 క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం శనివారం రోజు రాత్రి మెహదీపట్నంలోని మోహనకృష్ణగారి నివాసంలో జరిగింది. తెలుగు చిత్ర నిర్మాతలమందలి కార్యదర్శి తుమ్మల ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో బెంగళూరులోని ఎన్టీ.రామారావు గారి అభిమాన సంఘ సభ్యులు కె .వి సుబ్రహ్మణ్యం, పాలేటి రవి చంద్ర కుమార్, ఎస్. లక్ష్మీ నరసింహ స్వామి మోహన కృష్ణను శాలువాతో సత్కరించారు.

తర్వాత మోహన కృష్ణ తన తండ్రి రామారావు గారి ఫొటోలతో అందంగా ముద్రించిన నూతన సంవత్సర క్యాలెండర్ తన తండ్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు చనిపోయి 24 సంవత్సరాలు అవుతున్నా.. ఇప్పటికీ అభిమానులు ఆయన స్మృతికి నివాళిగా ఇలా చేయడం ఎంతో ఆనందంగా ఉందని ఈ సందర్భంగా మోహన కృష్ణ చెప్పారు. మహానటుడు, మహా నాయకుడు ఎన్ .టి రామారావు ఎప్పుడూ తెలుగు ప్రజల హృదయాల్లో శాశ్వతంగా ఉంటారని ప్రసన్న కుమార్ చెబు తూ ఈ సందర్భంగా అభిమానులు కె .వి సుబ్రహ్మణ్యం, పాలేటి రవి చంద్ర కుమార్, ఎస్ .లక్ష్మీ నరసింహ స్వామిని అభినందించారు.

NTR-2020 Calender Released Nandamuri Mohana Krishna

ntr-2020
sr ntr
calender
nandamuri mohana krishna