‘అల వైకుంఠపురములో..’ మ్యూజికల్ కాన్సెర్ట్ యూసుఫ్‌గూడాలోని పోలీస్ గ్రౌండ్స్‌లో చిత్ర ఒంటి, అల్లు అర్జున్ ఫాన్స్ నడుమ అంగరంగ వైభవంగా జరిగింది. అదే ఈవెంట్‌లో సినిమా ట్రైలర్ కూడా మెగా ఫాన్స్‌ని మైమరపింపజేసింది. అల టీజర్‌లోనే కాదు.. ట్రైలర్‌లోను త్రివిక్రమ్ మార్క్ కామెడీ పంచెలకు అల్లు అర్జున్ మ్యానరిజం, అండ్ లుక్ తోడైతే.. బొమ్మ హిట్టే. ‘అల వైకుంఠపురములో..’ ట్రైలర్‌లో పక్క ఫ్యామిలీ ఎమోషన్స్‌కు తోడు కామెడీ.. దానికి కావాల్సిన యాక్షన్ కూడా మిక్స్ చేసాడు త్రివిక్రమ్. మాస్‌కు కూడా ఈ చిత్రంలో కావాల్సినంత మసాలా ఉందని ఈ ట్రైలర్‌తోనే చూపించేసాడు.
అల్లు అర్జున్ - మురళి శర్మ ల కాంబో కామెడీ హైలెట్ అనేలా ఉంటె... అల్లు అర్జున్ ఆడవాళ్ళలో అంటే పూజ హెగ్డే ని చూపిస్తూ బ్రహ్మాజీతో చెప్పే ఓ డైలాగ్ అదిరింది. ఈ భూమ్మీద పుట్టించే హక్కు ఇద్దరికే ఉంది.. ఒకటి నేలకు.. రెండు వీళ్లకు అనే డైలాగ్ మాత్రం అదిరింది అనే చెప్పాలి. ఇంకా చరిత్రలో గొప్పగొప్ప యుద్ధాలన్నీ నా అనుకునే వాళ్లతోనే జరుగుతాయంటూ వచ్చే డైలాగ్ కూడా ఎమోషనల్ గా హత్తుకుంది. సీనియర్ హీరోయిన్ టబు అందం, పాత్రలోని గంభీరం ఆకట్టుకోగా.. త్రివిక్రమ్ మేకింగ్ స్టయిల్.. అడుగడుగునా అల్లు అర్జున్ లుక్స్, పంచ్ కామెడీ మ్యానరిజం అన్ని ఫాన్స్ కి ఎక్కేసేలా ఉన్నాయి. పూజ హెగ్డే గ్లామర్, ళ్లు అర్జున్ స్టైలిష్ యాక్షన్, సుశాంత్, నవదీప్ కేరెక్టర్స్, రాహుల్ రామకృష్ణ, సచిన్ ఖేడ్కర్ అల్లరి, మురళి శర్మ మిడిల్ క్లాస్ లుక్, అండ్ కేరెక్టర్, సముద్రఖని విలనిజం, అన్ని ఆలా ట్రైలర్ లో త్రివిక్రమ్ మార్క్ స్పెషల్ గా కనబడుతున్నాయి.
ఈ సినిమాకి హీరోగా అల్లు అర్జున్ పాత్రకి ఎంతగా పేరొస్తుందో.. అంత త్రివిక్రమ్ మేకింగ్ స్టయిల్ కి అంతే పేరొస్తుంది. ఇక థమన్ హిట్ మ్యూజిక్ అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ తో పాటుగా సినెమాటోగ్రఫీ అల వైకుంఠానికి హైలెట్ అనేలా ఉంది.