Advertisementt

ఆ షో సూపర్ హిట్.. కానీ ఇదేమో..!!

Mon 06th Jan 2020 10:52 PM
sankranthi special show,super hit,aadavari partilaku arthale verule  ఆ షో సూపర్ హిట్.. కానీ ఇదేమో..!!
Sankranthi Special Show Super Hit But..!! ఆ షో సూపర్ హిట్.. కానీ ఇదేమో..!!
Advertisement
Ads by CJ

జనవరి ఫస్ట్‌న ఈ టివి లో రోజా సింగిల్ హ్యాండ్ తో చేసిన ఆడవారి పార్టీలకు అర్ధాలే వేరులే.. స్పెషల్ ప్రోగ్రాం ఈటివి ఛానల్ లోనే కాదు... యూట్యూబ్ లోను అదిరిపోయే టాప్ ట్రేండింగ్ లోకి వెళ్ళిపోయింది. రోజా కూడా కమెడియన్స్ తో కలిసి స్కిట్స్ చెయ్యడం... జానీ మాస్టర్ డాన్స్ అబ్బో ఆడవారి పార్టీలకు ఆర్ధాలే వేరులే ఓ రేంజ్ హిట్ అయ్యింది. ఇక రోజా సింగిల్ హ్యాండ్ తో సక్సెస్ చేసిన ప్రోగ్రాం అది. ఇక తాజాగా సంక్రాంతికి కూడా ఈటివి మళ్ళీ స్పెషల్ ప్రోగ్రాం చెయ్యడం అప్పుడే దాని పబ్లిసిటీ యూట్యూబ్ లో మొదలెట్టడం జరిగింది. ఇక్కడ కూడా రోజా సింగిల్ గా దున్నేసింది. 2020 సంక్రాతి స్పెషల్ గా అమ్మ నాన్నా ఓ సంక్రాతి అంటూ ఓ స్పెషల్ ప్రోగ్రాం చేసింది ఈ టివి.

రోజా ఈసారి ఆమె కొడుకుని కూడా ఈ ప్రోగ్రాం లోకి దింపింది. ప్రదీప్ యాంకర్ గా.. అనసూయ హాట్ యాంకర్ గా ఈ ప్రోగ్రాం పిల్ల గ్యాంగ్ తో అదిరింది అనిపించింది. పిల్ల సందడి శేఖర్ మాస్టర్ కొడుకు, రోజా కొడుకు స్పెషల్ అట్రాక్షన్ కాగా.. అమ్మా బేరాల్లేవ్...అమ్మ అరవొద్దు నువ్వు ప్రతిపక్షం...నేను అధికార పక్షం అంటూ రోజాపై అమెకొడుకు ఎవసియన్ పంచ్ అయితే అదుర్స్. ఇక పిల్లల్లని కిడ్నాప్ చేసారంటూ హడావిడి చెయ్యడం, శ్రీను, సుధీర్ ల కామెడీ, అనసూయ కూడా హడావిడి చెయ్యడం, ప్రదీప్ మాచిరాజు పంచ్ లతో ఈ అమ్మా నాన్న ఓ సంక్రాతి స్పెషల్ అదిరింది కానీ... జనవరి ఫస్ట్ ఆడవారి పార్టీలకు ఆర్ధాలే వేరులే అన్న రేంజ్ లో ఆకట్టుకుంటుందా.. అనేది కాస్త డౌట్. ఇక జబర్దస్త్ లో అల్లరి చేసే దీవెన, నిహాల్ తల్లితండ్రులు కూడా ఈ స్పెషల్ ఈవెంట్ లో హడావిడి చేసారు. మరి సంక్రాంతికి ఈ స్పెషల్ ప్రోగ్రాం కోసం ఈటివి ప్రేక్షకులు బాగా వెయిట్ చేస్తున్నారు.

Sankranthi Special Show Super Hit But..!!:

Sankranthi Special Show Super Hit But..!!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ