అల్లు అర్జున్ అల వైకుంఠపురములో.. మ్యూజికల్ నైట్ హంగామా షురూ అయ్యింది. హైదరాబాద్ లోని యూసుఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో అల వైకుంఠపురములో మ్యూజికల్ కాన్సర్ట్ కి అల్లు అర్జున్ ఫాన్స్ భారీగా తరలి రావడం.. అక్కడ రోడ్ పై బన్నీ కటౌట్ కి పాలాభిషేకాలంటూ హంగామా చెయ్యడంతో.. స్టేడియం పరిసరప్రాంతాల్లో ట్రాఫిక్ జాం అవడంతో.. వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు. అల్లు అర్జున్.. బన్నీ అల వైకుంఠపురములో అంటూ ఫాన్స్ హంగామాతో రోడ్లు బ్లాక్ అయ్యాయి. ఇక రోడ్స్ బ్లాక్ అవడంతో.. పోలీస్ లకు చేతినిండా పనితగిలింది. పోలీస్ లు అక్కడి ట్రాఫిక్ ని క్లియర్ చేస్తూ అభిమనులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. ఫాన్స్ హంగామా వలన సాధారణ ప్రయాణికులు కష్టాలు పడకుండా ట్రాఫిక్ ని క్లియర్ చేస్తూ పోలీస్ లు కూడా బిజీ బిజీ అయ్యారు.
మరి అల్లు అర్జున్ - త్రివిక్రమ్ అల వైకుంఠపురములో సినిమా ఈవెంట్ వైకుంఠ ఏకాదది పర్వదినాన జరగడంతో.. అల్లు ఫాన్స్ అంతా అల వైకుంఠపురములో పక్కా హిట్ అంటూ నినాదాలు చేస్తూ హంగామా సృష్టిస్తున్నారు. అయితే అల వైకుంఠపురములో ఈవెంట్ ని వరుణుడు వెంటాడే ప్రమాదం లేకపోలేదు. ప్రస్తుతం వాతారవరణం మేఘావృతమై ఉండడంతో... ఇప్పటికే అక్కడికి భారీగా చేరుకుంటున్న ఫాన్స్ ఈ ఈవెంట్ ఎలా జరుగుతుందో అనే అయోమయంలో కనబడుతున్నారు.