Advertisementt

అయ్యో.. బండ్ల గణేష్‌ ఇది వెరీ దారుణం కదా..!!

Mon 06th Jan 2020 05:44 PM
bandla ganesh,producer bandla,sarileru neekevvaru,megastar chiranjeevi  అయ్యో..  బండ్ల గణేష్‌ ఇది వెరీ దారుణం కదా..!!
Interesting News About Bandla Ganesh!! అయ్యో.. బండ్ల గణేష్‌ ఇది వెరీ దారుణం కదా..!!
Advertisement
Ads by CJ

హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్‌కు పెద్దలు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేయగా.. సూపర్‌స్టార్-మెగాస్టార్ కలయికతో గ్రౌండ్ వీరాభిమానులతో కిక్కిరిసింది. ఈ ఈవెంట్‌లో భాగంగా డైరెక్టర్ మొదలుకుని నిర్మాతలు, టెక్నిషియన్స్.. మెగాస్టార్, సూపర్‌స్టార్ ఇలా అందరూ తమ అనుభవాలు, సినిమా గురించి.. పర్సనల్ లైఫ్.. గతంలో జరిగిన కొన్ని కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

కడుపుబ్బా నవ్వించాడుగా!

ఈ సందర్భంగా టాలీవుడ్ నిర్మాత కమ్ నటుడు బండ్ల గణేష్ వంతు రానే వచ్చింది. ఈ సందర్భంగా మెగాస్టార్ గురించి.. సూపర్ స్టార్ గురించి తనకు వచ్చినంతలో కాస్తో కూస్తో మంచిగానే మాట్లాడిన బండ్ల.. ఆసక్తికర ప్రసంగంతో అందర్నీ ఆకట్టుకున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే బండ్లను స్టేజ్‌పైకి పిలిపించి.. ప్రసంగం పూర్తయ్యే వరకూ సభికులు, కార్యక్రమానికి హాజరైన అభిమానులు, ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకున్నారు. అయితే సినిమా యూనిట్ గురించి అన్నెన్ని విషయాలు చెప్పిన బండ్లను మాత్రం పట్టించుకునే నాథుడే లేకపోయె..!

పాదాభివందనం!

మరీ ముఖ్యంగా..‘ఓ మెగాస్టార్ అయ్యుండి మరో సూపర్ స్టార్ సినిమా సూపర్ హిట్ అవ్వాలని ఆశీర్వదించడానికి వచ్చిన ఆయన సంస్కారానికి పాదాభివందనం చేస్తున్నాను. మీరు వందేళ్లు చల్లగా ఉండాలి సార్, మీరు ఇండస్ట్రీలోకి వచ్చి 43 ఏళ్లు. మీరు మరో 20 ఏళ్లు ఇండస్డ్రీలో అందరినీ అలరించాలి. ఎంత అందంగా ఉన్నారు సార్ మీరు..’ ఇలా చాలా చాలా విషయాలు చెప్పిన బండ్లను మాత్రం కనీసం ఎవరూ పట్టించుకోలేదు.

ఇది వెరీ దారుణం!

చిరు, సూపర్‌స్టార్ గురించి అన్నెన్ని మాటలు చెప్పాడు కదా.. కనీసం ఆ ఇద్దరిలో ఒక్కరి నోట అయినా బండ్ల అనే పేరు వచ్చింటే బాగుండేదేమో.. పాపం తన గురించి ఎవరో ఒక్కరైనా మాట్లాడతారా అని వెయిట్ చేసిన గణేష్‌కు చివరికి ఒక్కరంటే ఒక్కరు కూడా మాట్లాడకపోవడంతో కాస్త అసంతృప్తికి లోనయ్యాడట. వాస్తవానికి చిరు తనకు ఒక సినిమా ఇవ్వాలని బండ్ల కోరాడు.. కనీసం ఈ విషయంపై అయినా చిరు మాట్లాడి ఉంటే బాగుండేదేమో..!. ఆఖరికి సంగీత పేరు కూడా చెప్పిన చిరు పక్కనే ఉన్న  బండ్ల,.. పవన్‌ భక్తుడు గురించి మాట్లాడకపోవడం నిజంగా.. ఆయనను ఇది కూరలో కరివేపాకు తీసేసినట్లేనని.. ఇది వెరీ దారుణం ‘సరిలేరుకు..’ వచ్చిన సెలబ్రిటీస్! అంటూ నెటిజన్లు, సినీ విమర్శకులు పెద్ద ఎత్తున కామెంట్స్ వర్షం చేస్తున్నారు.

Interesting News About Bandla Ganesh!!:

Interesting News About Bandla Ganesh!!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ