హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్‌కు పెద్దలు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేయగా.. సూపర్‌స్టార్-మెగాస్టార్ కలయికతో గ్రౌండ్ వీరాభిమానులతో కిక్కిరిసింది. ఈ ఈవెంట్‌లో భాగంగా డైరెక్టర్ మొదలుకుని నిర్మాతలు, టెక్నిషియన్స్.. మెగాస్టార్, సూపర్‌స్టార్ ఇలా అందరూ తమ అనుభవాలు, సినిమా గురించి.. పర్సనల్ లైఫ్.. గతంలో జరిగిన కొన్ని కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా టాలీవుడ్ నిర్మాత కమ్ నటుడు బండ్ల గణేష్ వంతు రానే వచ్చింది. బండ్ల.. ఆసక్తికర ప్రసంగంతో అందర్నీ ఆకట్టుకున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే బండ్లను స్టేజ్‌పైకి పిలిపించి.. ప్రసంగం పూర్తయ్యే వరకూ సభికులు, కార్యక్రమానికి హాజరైన అభిమానులు, ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకున్నారు.
అన్నదమ్ముల్లాగా ఉన్నారు సార్!
‘మీరు వందేళ్లు చల్లగా ఉండాలి చిరంజీవి సార్. మీరు ఇండస్ట్రీలోకి వచ్చి 43 ఏళ్లు. ఇంకో 20 ఏళ్లు ఇండస్డ్రీలో అందర్నీ అలరించాలి. మీరు ఎంత అందంగా ఉన్నారు సార్ . మహేశ్ బాబు పక్కన మిమ్మల్ని చూస్తుంటే మీ ఇద్దరూ అన్నదమ్ములుగా యాక్ట్ చేయాలనిపిస్తోంది సార్. మెగాస్టార్ చిరంజీవి గారు మళ్లీ నటించాలని నేను మొక్కని దేవుడంటూ లేరు. కానీ మీ అబ్బాయికే సినిమాలు చేస్తున్నారు సార్.. నాకు ఒక్క సినిమా కూడా చెయ్యలేదు.. నాకూ అవకాశమివ్వండి సార్’ అని సరిలేరు స్టేజ్ వేదికగా చిరును బండ్ల రెక్వెస్ట్ చేశాడు.
ప్లీజ్ బ్లేడ్ గణేశ్ వద్దు..!
‘తప్పు చేశా.. ఇప్పుడే సుమ చెప్పినట్టు 7ఒ క్లాక్ బ్లేడ్‌తో.. అది నీకు వేస్ట్ రా.. నీకు సినిమానే బెస్ట్ రా.. సినిమాల్లోనే ఉండాలి.. సినిమాల్లోనే జీవితం.. వెర్రి డ్యాష్ అనిపించుకుని నాకు నేనే.. మళ్లీ మీ ముందుకొచ్చాను. ప్లీజ్ నన్ను ఎవ్వరూ బ్లేడ్ గణేశ్ అని పిలవొద్దు. దయచేసి చెబుతున్నా బండ్ల గణేశ్ అనే పిలవండి. తెలిసోతెలియకో నోరుజారాను. అందరూ వెర్రిపప్పను చేశారు. సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నేను కూడా నటించాను. ఇకపై నేను సినిమాలే లోకంగా బతుకుతాను. అమ్మ తోడయ్యా.. ఇంకే పని చేయను.. సినిమాల్లోనే ఉంటాను’ అని ఉద్వేగంతో బండ్ల ప్రసంగించాడు. మొత్తానికి చూస్తే.. ఎన్నెన్ని ఊర్లు తిరిగినా సొంతూరే ఆఖరికి దిక్కు అన్నట్లుగా.. ఎక్కడికెక్కడికి తిరిగినా.. ఎన్ని రంగాల్లో రాణించినా చివరికి మొదటిదే దిక్కు.. అని బండ్లకు బాగా బుద్ధొచ్చిందన్న మాట.