సూపర్‌స్టార్ మహేష్ బాబు-అనిల్ రావిపూడి ‘సరిలేరూ నీకెవ్వరు’ సందడి షురూ అయ్యింది. చిరు గెస్ట్‌గా మహేష్ సరిలేరూ నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా లాల్ బహదూర్ స్టేడియంలో జరిగింది. మరా ఈవెంట్ లోనే మెగాస్టార్ చిరు చేతుల మీదుగా సరిలేరూ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం కూడా సందడిగా జరిగింది. లేడి అమితాబ్ విజయశాంతి, రష్మిక అల్లరి క్యూట్ డాన్స్, సంగీత, తమన్నా డాన్స్ పెరఫార్మెన్స్ అబ్బో ప్రీ రిలీజ్ ఈవెంట్ సందడి అంతా ఇంతా కాదు. ఇక సరిలేరూ ట్రైలర్ లోకొస్తే అనిల్ రావిపూడి మార్క్ కామెడీ, మహేష్ మార్క్ యాక్షన్ కలగలిపిన సినిమాగా ఈ సినిమా ఉండబోతుంది అనేది సరిలేరూ ట్రైలర్ తో స్పష్టమవుతుంది.
సరిలేరూ నీకెవ్వరూ ట్రైన్ ఎపిసోడ్ అబ్బో అంటూ ఊదరగొడుతున్నట్లే.. ఈ సినిమాలో ట్రైన్ ఎపిసోడ్ తో ట్రైలర్ స్టార్ట్ చేసారు. రశ్మికకి క్యూట్ గా అందంగా ఉన్న అబ్బాయి ట్రైన్ జర్నీలో తగలాలనీ దేవుణ్ణి కోరుకొగానే మహేష్ కనిపించడం మనసు పారేసుకోవడం, మహేష్ ని ప్రేమించెయ్యడం, ఇంకా బండ్ల గణేష్ బ్యాచ్ కామెడీ, రష్మిక, సంగీత, హరితేజ హంగామా, మహేష్, రాజేంద్రప్రసాద్ కూడా కోరస్ గా కామెడీ చెయ్యడంతో.. ట్రైలర్ ఫస్ట్ హాఫ్ పూర్తవుతుంది. ఇక ట్రైలర్ సెకండ్ హాఫ్ లో మహేష్ యాక్షన్ స్టార్ట్ చేసాడు. విజయశాంతి సిన్సియర్ ఆఫీసర్ గా 15 ఏళ్ళ కెరీర్ లో తప్పుని రైట్ అంటూ సంతకం పెట్టదు.. ఇక ప్రకాష్ రాజేమో తప్పులే పనిగా పెట్టుకుంటాడు. అంటే తప్పుని రైట్ గా మార్చేదాకా ఊరుకునే రకం కాదు. ఇక మహేష్, విజయశాంతి బాడీ గార్డ్ లెక్క... ఆమె ఎక్కడికెళ్లినా ఆమె వెన్నంటే ఉండడమే కాదు.... ప్రకాష్ రాజ్ కి వార్నింగ్ లాంటివి ఇస్తుంటాడు. ఇక రాజకీయనాయకుల కోసం, ప్రజల కోసం బోర్డర్ లో కష్టపడుతుంటే మీరు మాత్రం అంటూ రాజకీయనాయకులకు ఓ పంచ్ వేస్తాడు మహేష్.
ఇక ట్రైలర్ చివర్లో.. చిన్న బ్రేక్ ఇస్తున్నాను తర్వాత బొమ్మ దద్దరిల్లి పోద్ది అంటూ మహేష్ చెప్పిన డైలాగ్ మాత్రం సంక్రాతి సినిమాలకి చిన్నపాటి వార్నింగ్ ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. ఇక చివర్లో మహేష్ లుంగీ కట్టుకుని మాస్ గా అలా కనిపించగానే.. ట్రయిల్ ఎండ్ చేసేరు. ఈ సరిలేరూ నీకెవ్వరూ ట్రైలర్ మొత్తం కామెడీ - యాక్షన్ ప్యాకేజ్ లా దిట్టంగా కనబడుతుంది. కాకపోతే మహేష్ వాయిస్ లో ఏదో వెలితి, రష్మిక అల్లరిలో కాస్త అతి అన్నట్టుగా అక్కడక్కడా అనిపిస్తుంది కానీ.. మహేష్ ఫాన్స్ కి మాత్రం ఈ ట్రైలర్ చూస్తుంటే పూనకాలే.