ఖాళీగా ఉండి ఐటెం చెయ్యలేదు.. దర్శకుడు అడిగాడని.. ఆయన మీదున్న గౌరవంతో ఐటెం సాంగ్ చేశా అని చెప్పిన తమన్నా సీనియర్ హీరోలతో అవకాశమొచ్చినా.. కాదనకుండా నటించేస్తుంది. గత ఏడాది వెంకటేష్ తో కలిసి హాట్ హాట్ అందాలతో ఎఫ్ 2 లో నటించి బ్లాక్ బస్టర్ కొట్టిన తమన్నా అదే ఏడాది మరో సీనియర్ హీరో చిరంజీవితో కలిసి సై రా లాంటి భారీ చిత్రంలోనూ నటించింది. సై రా నరసింహారెడ్డి సినిమా పోయినా... ఆ సినిమాలో లక్ష్మి పాత్ర చేసిన తమన్నాకి మంచి పాత్ర వచ్చింది. అయితే ఈ ఇద్దరు సీనియర్ హీరోలతో సర్దుకుపోయిన తమన్నా ఇప్పుడు మరో సీనియర్ హీరో బాలకృష్ణకి నో చెప్పిందని టాక్ నడుస్తుంది.
బాలకృష్ణ - బోయపాటి సినిమాకిగాను తమన్నాని హీరోయిన్ పాత్రకి సంప్రదించినట్లుగా సమాచారం. అయితే తనకి డేట్స్ సర్దుబాట్లు కాని కారణంగా బాలకృష్ణ సరసన నటించేందుకు తమన్నా బోయపాటి సినిమాకి నో చెప్పినట్టుగా తెలుస్తుంది. కానీ బాలయ్య ఫ్యాన్స్ మాత్రం వెంకీ, చిరులతో అయితే నటిస్తుంది కానీ.. మా హీరోతో నటించడానికి డేట్స్ సర్దుబాటు కానంత బిజినా అంటూ మండిపడుతున్నారు. అయితే రెండు డిజాస్టర్స్ తో ఉన్న బాలయ్య సరసన నటించేందుకు తమన్నా ఆలోచిస్తుందని.. అందుకే డేట్స్ సర్దుబాటు అనే వంక చెప్పింది అంటున్నారు.