రాశి ఖన్నా టాలీవుడ్ లో కెరీర్ ని చక్కదిద్దుకుంటుంది. లావుగా ఉన్న రాశి ఖన్నా కెరీర్ కోసం సన్నగా నాజూగ్గా మారిపోయి... యంగ్ హీరోలతో అవకాశాలు చేజిక్కించుకుంటుంది. రాశి నటించిన వెంకిమామ సినిమా ప్లాప్ టాక్ తో మంచి కలెక్షన్స్ కొల్లగొట్టగా.. రాశి తాజా చిత్రం ప్రతిరోజు పండగే యావరేజ్ టాక్ తో కోట్లు కొల్లగొట్టడమే కాదు. ఏంజిల్ ఆర్నా పాత్రలో రాశి ఖన్నా మంచి నటన కనబర్చి విమర్శకుల ప్రశంసలు పొందింది. ఇక రాశి ఖన్నా నటించిన మరో చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. విజయ్ దేవరకొండ సరసన నటిస్తున్న రాశి ఖన్నా ఈ సినిమాలో గుంపులో గోవిందంలా నలుగురు హీరోయిన్స్ తో నటిస్తుందని అనుకున్నారు.
కానీ రాశి ఖన్నా వరల్డ్ ఫేమస్ లవర్ లో ఓ కీలక పాత్ర చేసిందని.. విజయ్ దేవరకొండతో ఆమె నటించిన ఇంటిమసీ సన్నివేశాలు చాలా బోల్డ్ గా ఉండబోతున్నాయనేది వరల్డ్ ఫేమస్ లవర్ టీజర్ చూస్తే తెలుస్తుంది. రాశి ఖన్నా బోల్డ్ నెస్ చూసిన ఫ్యాన్స్ విజయ్ దేవరకొండతో హిట్ కొట్టాలనే కసితో రాశి తన గత ఇమేజ్ ని వదిలివేసింది అనుకుంటున్నారు. విజయ్ దేవరకొండను అమితంగా ప్రేమించే యామిని అనే అమ్మాయిగా రాశి ఖన్నా కీ రోల్ ప్లే చేస్తుంది. వరల్డ్ ఫేమస్ లవర్ టీజర్ స్టార్టింగ్ లోనే రాశి ఖన్నా టాప్ లెస్ బ్యాక్ షాట్ లో స్నానం చేస్తూ కనిపించడం చూసిన వారు రాశి ఖన్నా హద్దులు దాటేసి ఈ సినిమాలో నటించింది అని ఫిక్స్ అవుతున్నారు. మరి టీజర్ లోనే ఇన్ని అందాలు చూపించిన రాశి ఖన్నాసినిమాలో మరిన్ని అందాలతో రెచ్చిపోతుంది కదా.. సో ఈ సినిమాతో రాశి కెరీర్ పరుగులు పెట్టడం ఖాయం. ఇప్పటివరకు హాట్ గ్లామర్ పాత్రలకు సై అన్న రాశి ఇప్పుడు బోల్డ్ కేరెక్టర్స్ కూడా సై అనేట్లుగానే కనబడుతుంది.