కన్నడ నుండి రాకెట్‌లా దూసుకొచ్చిన కెజిఎఫ్ పార్ట్ 1 అన్ని భాషల్లోనూ హిట్ అయ్యింది. తెలుగులో నాలుగు కోట్లకి కొన్న డిస్ట్రిబ్యూటర్స్ కి కెజిఎఫ్ ఇక్కడ 13 కోట్లు కొల్లగొట్టింది. ఇక తమిళనాట అయితే 10 కోట్లు.. హిందీలో అయితే ఏకంగా 40 కోట్లు కొల్లగొట్టి హీరో యష్ ఇక్కడి హీరోలకు సవాల్ విసిరాడు. కెజిఎఫ్ తో క్రేజ్ సాధించిన యష్ ఇప్పుడు కెజిఎఫ్ 2 తోనూ పిచ్చ క్రేజ్ మీదున్నాడు. కెజిఎఫ్ పార్ట్ 2 మీద భీభత్సమైన అంచనాలున్నాయి. కెజిఎఫ్ తో పాటే కెజిఎఫ్ 2 కూడా విడులవుతుంది అనుకుంటే... దర్శకుడు ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ కి వచ్చిన రెస్పాన్స్ చూసి ఈ సినిమాని పాన్ ఇండియా మూవీగా మార్చేసాడు.
ఇక షూటింగ్ చివరి దశలో ఉన్న కెజిఎఫ్ బిజినెస్ మాత్రం మొదలు కాలేదు. కారణం కెజిఎఫ్ నిర్మాతలు ఈ సినిమా బిజినెస్ విషయంలో భారీ ప్లాన్ లో ఉన్నారు. మొదటి సినిమాకొచ్చిన క్రేజ్ రెండో పార్ట్ కి భారీ అంచనాలుండడమే కాదు.. ఇతర భాషలనుండి కెజిఎఫ్ నిర్మాతలకు మూడు రెట్ల భారీ ఆఫర్స్ వస్తున్నాయట. కానీ కెజిఎఫ్ నిర్మాతలు మాత్రం తొందరపడకుండా.... ఇప్పుడే సినిమా అమ్మకూడదని వాళ్లు మెంటల్‌గా ఫిక్స్ అయిపోయారు. అయితే సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత గానీ అసలు బిజినెస్ మొదలుపెట్టాలి అని... అప్పటి వరకు కెజిఎఫ్ ట్రైలర్స్, టీజర్స్ విడుదలవుతాయి కాబట్టి అప్పుడు అనుకున్నదానికన్నా భారీగా బిజినెస్ జరుగుతుంది అని కెజిఎఫ్ నిర్మాతలు భావిస్తున్నారట.