Advertisementt

చిరు సరసన ఆ భామ చేయనందా?

Fri 03rd Jan 2020 08:31 PM
regina,rejected,megastar,chiranjeevi,koratala siva,new movie  చిరు సరసన ఆ భామ చేయనందా?
Young Heroine Jhalak to Megastar చిరు సరసన ఆ భామ చేయనందా?
Advertisement
Ads by CJ

చిరంజీవి - కొరటాల శివ కాంబోలో క్రేజీ ప్రాజెక్ట్ ఈ నెలాఖరు నుండి పట్టాలెక్కబోతుంది. దేవాదాయ శాఖలో జరిగే అవినీతిని అరికట్టే ప్రధానాంశంతో రూపొందుతున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్ గా త్రిషని ఫైనలైజ్ చేసాడు కొరటాల శివ. త్వరలోనే ఈ సినిమాలో నటించబోయే నటుల వివరాలను అధికారికంగా ప్రకటిస్తారని, ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసి చిరు లుక్ టెస్ట్ కూడా కొరటాల పూర్తి చేసినట్లుగా ఫిలింనగర్ టాక్. చిరు కూడా కొరటాల శివ సినిమా కోసం బాగా బరువు తగ్గి కాస్త యూత్ లా కనబడుతున్నాడు. ఇకపోతే త్రిష హీరోయిన్ గా నటించబోయే సినిమాలో రెజీనా ఓ ఐటెం సాంగ్ చేయబోతున్నట్లుగా గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఇక రెజీనా చిరు సినిమాలో ఐటెంలో ఫిక్స్ అనే అన్నారు.

కానీ తాజాగా రెజీనాని చిరు సినిమా కోసం కొరటాల టీం సంప్రదించింది అని... అయితే రెజీనా ఆలోచించి చెబుతానని చెప్పినట్లుగా అన్నారు. కానీ ఇప్పుడు  రెజీనా చిరు సినిమాలో నటించడం లేదని.. ప్రస్తుతం హీరోయిన్స్ ఆఫర్స్, కాస్త నెగెటివ్ పాత్రలు తగులుతున్నాయని, విభిన్న కథలతో పాత్రలతో  గుర్తింపు కోసం చూస్తున్న టైంలో ఐటెం గర్ల్ అవతారమెత్తితే తర్వాత హీరోయిన్ గా ఛాన్సెస్ మిస్ కావొచ్చని అందుకే చిరు సినిమాకి రెజీనా నో చెప్పిందని టాక్ మొదలాయింది.

Young Heroine Jhalak to Megastar:

Regina Rejected Megastar Chiranjeevi Film Offer

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ