Advertisementt

RRRలో ‘గుండు’లో కనిపించనున్న బుడ్డోడు!

Fri 03rd Jan 2020 03:47 PM
rrr movie,jr ntr,gundu,ram charan,jakkanna,rajamouli  RRRలో ‘గుండు’లో కనిపించనున్న బుడ్డోడు!
Intresting News About RRR Movie RRRలో ‘గుండు’లో కనిపించనున్న బుడ్డోడు!
Advertisement
Ads by CJ

బాహుబలి సినిమాతో తన సత్తా ఏంటో యావత్ ప్రపంచానికి చాటిచెప్పిన దర్శకధీరుడు రాజమౌళి అలియాస్ జక్కన్న తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘RRR’. ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ నటిస్తున్నారన్న విషయం తెలిసిందే. వీరిద్దరూ ఫలానా పాత్రల్లో నటిస్తున్నారని మాత్రమే చెప్పిన జక్కన్న.. ఇంతవరకూ చిన్నపాటి లుక్ గానీ రిలీజ్ చేయకపోవడం గమనార్హం. అయితే సినిమాకు సంబంధించి పుకార్లు మాత్రం బోలెడన్ని షికార్లు చేస్తున్నాయి. అయితే.. ‘RRR’ యూనిట్ నుంచి అప్డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా..? అని అటు ఎన్టీఆర్.. ఇటు చెర్రీ.. మరోవైపు జక్కన్న వీరాభిమానులు వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. ఇంతవరకూ ఎలాంటి లుక్ రిలీజ్ చేయకపోవడంతో జనవరి ఫస్ట్‌కు కచ్చితంగా ఆర్ఆర్ఆర్ కాంపౌండ్ నుంచి శుభవార్త అందుతుందని అందరూ అనుకున్నారు. అయితే ఊరించిన రాజమౌళి.. చివరికి ఉసూరుమనిపించాడు.

అయితే న్యూ ఇయర్ ప్రారంభం అయ్యిందో లేదో పుకార్లు మరింత పెరిగాయ్. తాజాగా ఎన్టీఆర్ పాత్రపై ఇంట్రెస్టింగ్ పుకారు షికారు చేస్తోంది. ఈ సినిమాలో జూనియర్‌ను ‘గుండు’లో చూపించనున్నాడన్నదే ఆ పుకారు సారాంశం. వాస్తవానికి మిగతా హీరోలతో పోలిస్తే.. ఎలాంటి పాత్రకైనా.. ఎలాంటి గెటప్‌లో కనిపించాలన్నా బుడ్డోడే ఫస్ట్. అలాంటిది ‘జూనియర్ గుండులో కనిపించాల్సి ఉంటుంది.. బీ రెడీ’ అని జక్కన్న చెప్పగానే ‘సార్.. మీరు ఎలాగంటే అలానే సార్’ అని ఒప్పుకున్నాడట. అంటే ఇప్పటికే ఈ సినిమా కోసం బరువు బాగా పెరిగిన ఎన్టీఆర్.. గుండులో కనిపించడానికి మరో త్యాగం చేశాడన్న మాట. కాగా.. ఈ గుండు గెటప్‌లోని సన్నివేశాలను ఫిబ్రవరి మొదటి వారంలో చిత్రీకరించనున్నారట. ఈ తాజా పుకారులో ఏ మాత్రం నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ వేచి చూడక తప్పదు మరి.

Intresting News About RRR Movie:

Intresting News About RRR Movie  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ