Advertisementt

‘అసురన్’ రీమేక్‌లో హీరోయిన్ ఈ బ్యూటీనే!?

Fri 03rd Jan 2020 03:33 PM
priyamani,venkatesh,asuran,asuran remake  ‘అసురన్’ రీమేక్‌లో హీరోయిన్ ఈ బ్యూటీనే!?
Priyamani cast opposite Venkatesh in Telugu remake of Asuran ‘అసురన్’ రీమేక్‌లో హీరోయిన్ ఈ బ్యూటీనే!?
Advertisement
Ads by CJ

తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ అల్లుడు, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, వెట్రి మారన్ కాంబినేషన్‌లో రూపొందిన ‘అసురన్’ సినిమా తెలుగు రీమేక్ కానుంది. ఈ సినిమాలో దగ్గుబాటి వెంకటేశ్ హీరోగా నటించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాను ఎవరు తెరకెక్కించనున్నారనే విషయంపై సస్పెన్స్ మీద సస్పెన్స్‌ల తర్వాత క్లారిటీ వచ్చేసింది. ఎందరో పేర్లు.. కుర్ర డైరెక్టర్స్, సీనియర్ డైరెక్టర్స్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందే లిస్ట్‌లో ఉన్నారు. ఫైనల్‌గా శ్రీకాంత్ అడ్డాల దగ్గరికొచ్చి ‘అసురన్’ ఆగింది. అయితే సినిమాలో హీరోయిన్‌గా ఎవర్ని తీసుకోవాలి..? ఏ పాత్రకు ఎవర్ని తీసుకోవాలి..? సెట్స్ ఎక్కడ వేయాలి..? అనే పనిలో బిజిబిజీగా ఉన్న శ్రీకాంత్.. తాజాగా హీరోయిన్‌ను ఫైనల్‌ చేసినట్లు వార్తలు వస్తున్నాయ్.

ఆ బ్యూటీ మరెవరో కాదు.. ఒకప్పుడు టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపిన ప్రియమణి. సీనియర్ హీరోయిన్ బాగుంటుందని భావించిన దర్శకుడు మొదట త్రిషను సంప్రదించినప్పటికీ ఆమె కొరటాల శివ-మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నటిస్తుండటంతో ప్రియమణిని ఫిక్స్ చేసినట్లు టాక్ నడుస్తోంది. ఇప్పటికే ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు.. సినిమా కోసం బరువు తగ్గే పనిలో నిమగ్నమైందట. ఈ తాజా రూమర్‌లో నిజానిజాలెంతో తెలియాల్సి ఉంది. అధికారిక ప్రకటన వస్తే గానీ ప్రియమణి ఫిక్స్ అయ్యిందా లేదా అనే విషయం తెలియదు మరి.

Priyamani cast opposite Venkatesh in Telugu remake of Asuran:

Priyamani cast opposite Venkatesh in Telugu remake of Asuran  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ