Advertisementt

సూపర్‌స్టార్‌ను ఫాలో అవుతున్న రౌడీ స్టార్!

Fri 03rd Jan 2020 01:13 PM
vijay devarakonda,multiplex,avd cinemas,asian cinemas,world famous lover,fighter  సూపర్‌స్టార్‌ను ఫాలో అవుతున్న రౌడీ స్టార్!
Vijay Devarakonda Follows Mahesh Babu సూపర్‌స్టార్‌ను ఫాలో అవుతున్న రౌడీ స్టార్!
Advertisement
Ads by CJ

ఒక్క సినిమాతోనే టాలీవుడ్‌లో తన సత్తా ఏంటో చాటి.. క్రేజీ స్టార్‌గా యంగ్ హీరో విజయ్‌ దేవరకొండ  పేరు తెచ్చుకున్నాడు. ‘పెళ్లి చూపులు’ అంటూ వచ్చి ‘అర్జున్ రెడ్డి’గా మారి ‘గీత గోవిందం’ సినిమాతో ఇక తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు. ఇటు హీరోగానే కాదు.. అటు బిజినెస్, ప్రకటనల విషయంలోనూ క్రేజీగానే ముందుకెళ్తున్నాడీ కుర్ర హీరో. ఇప్పటికే ‘రౌడీ’ అనే బ్రాండ్‌తో బట్టల వ్యాపారంలోకి దిగిన విజయ్, ఆ తర్వాత ప్రొడక్షన్‌లోకి దిగి ‘మీకు మాత్రమే చెప్తా’ అనే సినిమాను నిర్మించాడు. తాజాగా మరో కొత్త వ్యాపారాన్ని ఆయన ప్రారంభిస్తున్నాడని టాక్ నడుస్తోంది. అంటే దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్న టాలీవుడ్ నానుడిని విజయ్‌కు గట్టిగానే అవపోషణ పట్టిందన్న మాట.

మల్టీప్లెక్స్ థియేటర్ బిజినెస్ రంగంలోకి రౌడీ స్టార్ దిగనున్నాడట. ఏషియన్ సినిమాస్‌తో కలిసి మల్టీప్లెక్స్ బిజినెస్ స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయ్యాడట. మహబూబ్ నగర్‌లో ఏవీడీ పేరుతో తొలి మల్టీప్లెక్స్ థియేటర్‌ను ప్రారంభించబోతున్నాడని టాక్ నడుస్తోంది. అంటే.. రీల్ లైఫ్‌లోనే కాదు.. రియల్ లైఫ్‌లోనూ ఈ రౌడీ స్టార్.. సూపర్‌‌స్టార్ మహేశ్ బాబును ఫాలో అవుతున్నాడన్న మాట. ఇప్పటికే మహేశ్ ఏఎంబీ సినిమాను స్టార్ట్ చేయడం.. ఆ తర్వాత బట్టల బిజినెస్ పెట్టడం రెండూ జరిగిపోయాయ్. అయితే బట్టల బిజినెస్ వ్యవహారం అలా సక్సెస్‌ఫుల్‌గా నడుస్తుండగానే మల్టీప్లెక్స్ రంగంలోకి దూకుతున్నాడన్న మాట. 

ఇప్పటికే ఏషియన్ సంస్థ.. మహేశ్ చేతులు కలిపి మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందంగా బిజినెస్‌ రన్‌ చేస్తోంది. అందుకే.. క్రేజీ ఫాలోయింగ్ ఉన్న ఈ కుర్ర హీరో విజయ్‌తో జత కట్టాలని భావించి మహబూబ్‌నగర్ ఏవీడీ పేరుతో తొలి మల్టీప్లెక్స్ థియేటర్‌ను ప్రారంభించబోతున్నారట. ఏషియన్ సంస్థకు బ్రాండ్ బాబు విజయ్ తోడైతే ఇక పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. కాగా ఇది ఎంతవరకూ నిజమో రౌడీ స్టార్ స్పందిస్తే గానీ క్లారిటీ వచ్చేలా లేదు.

Vijay Devarakonda Follows Mahesh Babu:

Vijay Devarakonda Follows Mahesh Babu

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ