Advertisementt

‘సరిలేరు నీకెవ్వరు’కి సెన్సార్ బూస్ట్!

Fri 03rd Jan 2020 12:39 PM
sarileru neekevvaru,censor completed,mahesh babu,anil ravipudi  ‘సరిలేరు నీకెవ్వరు’కి సెన్సార్ బూస్ట్!
Sarileru Neekevvaru Movie Censor Completed ‘సరిలేరు నీకెవ్వరు’కి సెన్సార్ బూస్ట్!
Advertisement
Ads by CJ

సెన్సార్ పూర్తిచేసుకొని యుబైఏ సర్టిఫికెట్ పొందిన సూపర్‌స్టార్‌ మహేష్‌ ‘సరిలేరు నీకెవ్వరు’! సంక్రాంతి కానుక‌గా ప్రపంచవ్యాప్తంగా విడుద‌ల‌!!

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి.ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న అవుట్‌ అండ్‌ అవుట్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌ ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్‌ విజయశాంతి నటిస్తున్నారు. ఇప్ప‌టికే  విడుదలైన టీజర్‌, సాంగ్స్ కి టెర్రిఫిక్‌ రెస్పాన్స్‌ వస్తోంది. కాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్ పొందింది.

జనవరి 5 ఆదివారం సాయంత్రం 5:04నిమిషాలకు హైద‌రాబాద్ లాల్‌బహదూర్‌ స్టేడియంలో మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా అభిమానుల సమక్షంలో గ్రాండ్‌గా ‘సరిలేరు నీకెవ్వరు మెగా సూపర్‌ ఈవెంట్’ను నిర్వహించి సంక్రాంతి కానుక‌గా ప్రపంచవ్యాప్తంగా విడుద‌ల‌చేయ‌నున్నారు.

సూపర్‌స్టార్‌ మహేష్‌, రష్మిక మందన్న, ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్‌ విజయశాంతి, రాజేంద్రప్రసాద్‌, ప్రకాష్‌రాజ్‌, సంగీత, బండ్ల గణేష్ త‌దిత‌రులు నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌, రత్నవేలు, కిశోర్‌ గరికిపాటి, అజ‌య్ సుంక‌ర‌, త‌మ్మిరాజు, రామ్‌లక్ష్మణ్‌, యుగంధర్ టి.ఎస్‌. కృష్ణ సాంకేతిక వర్గం.

Sarileru Neekevvaru Movie Censor Completed:

Sarileru Neekevvaru Movie Ready to Release

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ