అట్టహాసంగా హాల్ చల్ ప్రీ రిలీజ్ ఈవెంట్, జవవరి 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల !!!
ఎమ్.ఎస్.కె డిజిటల్ బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ సమర్పించు, శ్రీ రాఘవేంద్ర ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై గణేష్ కొల్లూరి నిర్మించిన హల్ చల్ జనవరి 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిత్ర యూనిట్ సభ్యులతో పాటు దర్శకులు క్రాంతి మాధవ్, శివ నిర్వాణ, నిర్మాతలు బెక్కం వేణు గోపాల్, మల్కాపురం శివ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ.... అందరికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు. హాల్ చల్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరవ్వడం సంతోషంగా ఉంది. నేను ఈ సినిమా చూశాను, బాగుంది. రేపు సినిమా విడుదల తరువాత ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. మంచి కంటెంట్ తో కూడుకున్న సినిమా ఇది. అందుకోసం నా వంతు సహాయం చేశానన్నారు.
హీరో రుద్రాక్ష్ మాట్లాడుతూ.... మా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన క్రాంతి మాధవ్, శివ నిర్వాణ గారికి థాంక్స్, మేము ఇష్టపడి ఈ సినిమా చేశాము. నన్ను నమ్మి ఈ సినిమా చేసిన నా నిర్మాతకు జీవితాంతం రుణపడి ఉంటాను. డైరెక్టర్ నాకు ఈ కథ చెప్పగానే నచ్చింది, చేసాను. సినిమా షూటింగ్ ఆలస్యం అవుతోంది, రిలీజ్ డేట్ పై క్లారిటీ రావడం లేదు, అలాంటి సమయంలో శివకుమార్ గారు మాకు బాగా సపోర్ట్ చేశారు. కొత్త కాన్సెప్ట్స్ ను అలరించే ఆడియన్స్ ఈ సినిమాను తప్పకుండా ఆదరిస్తారని నమ్మకం ఉంది. మమ్మల్ని ఆశీర్వదించాలని ప్రేక్షకులకు ఈ సందర్భంగా కోరుకుంటున్నా అన్నారు.
బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ... నేను ఈ సినిమా చూశాను, చూస్తున్నంత సేపు సినిమాను ఎంజాయ్ చేశాను. ఇలా కొత్త కంటెంట్ తో వస్తోన్న కొత్త సినిమాలు సక్సెస్ అవుతాయని నమ్ముతున్నాను. సినిమా చాలా ఎంగేజింగ్ ఉంటుంది. రుద్రాక్ష, ధన్య కు ఈ సినిమా మంచి బ్రేక్ ఇస్తుంది. దర్శక నిర్మాతలకు ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెడుతోందని నమ్ముతున్నాను అన్నారు.
డైరెక్టర్ శివ నిర్వాణ మాట్లాడుతూ... రీసెంట్ టైమ్స్ లో కంటెంట్ బాగున్నా చిన్న సినిమాలు బాగా ఆడుతున్నాయి. అలాగే ఈ సినిమా సక్సెస్ అవుతుందని నమ్ముతున్నాను. రుద్రాక్ష నాకు మంచి ఫ్రెండ్, తనకు ఈ సినిమా మంచి హిట్ అవుతుందని అలాగే చిత్ర యూనిట్ సభ్యులకు పెద్ద విజయం సాధించి పెడుతుందని భావుస్తున్నాను అన్నారు.
డైరెక్టర్ క్రాంతి మాధవ్ మాట్లాడుతూ... రుద్రాక్ష్ నాకు మంచి ఫ్రెండ్, ఇండస్ట్రీలో ఉన్న తక్కువ ఫ్రెండ్స్ లో తాను ఒకడు, తాను ఎంతో కష్టపడి ఈ సినిమా తీసాడు. ఈ సినిమా హిట్ అయ్యి చిత్ర యూనిట్ సభ్యులకు మంచి పేరు రావాలని కోరుకుంటున్నా అన్నారు.
డైరెక్టర్ శ్రీపతి మాట్లాడుతూ.... మా సినిమా విడుదలకు హెల్ప్ చేసిన మల్కాపురం శివకుమార్ గారికి థాంక్స్, ఈ ఫంక్షన్ కు వచ్చిన డైరెక్టర్స్ క్రాంతి మాధవ్, శివ నిర్వాణ గారికి ధన్యవాదాలు. హీరోయిన్ ధన్య మాకు బాగా సపోర్ట్ చేశారు, నన్ను నిర్మాతను కలిపింది రుద్రాక్ష్, తాను ప్రాణం పెట్టి ఈ సినిమా చేశాడు. మదర్ అండ్ సన్ మధ్య సన్నివేశాలు ఈ సినిమాలో ఆడియన్స్ కు నచ్చుతాయి. ఎడిటర్ ప్రవీణ్ పూడి, కెమెరామెన్ రాజ్ తోట గారికి థాంక్స్, ఆడియన్స్ డబ్బు పెట్టి కొన్న టికెట్ కు ఈ హాల్ చల్ సినిమా పూర్తి న్యాయం చేస్తుందని తెలిపారు.
నిర్మాత గణేష్ మాట్లాడుతూ.... హాల్ చల్ మూవీని 3 ఏళ్ళ నుండి కష్టపడి తీశాము. ఎప్పుడు విడుదల అవుతుందో తెలియని పరిస్థితి, అలాంటి సందర్భంలో నిర్మాత మల్కాపురం శివకుమార్ నాకు సపోర్ట్ చేశారు. ఆయనకు నా ప్రేత్యేక ధన్యవాదాలు. హీరో, హీరోయిన్, డైరెక్టర్ ఇలా అందరూ కష్టపడి సినిమా చేశారు. మా ప్రయత్నాన్ని మీరందరూ అభినందిస్తారని కోరుకుంటున్నా అన్నారు.
హీరోయిన్ ధన్య బాలకృష్ణ మాట్లాడుతూ... శివకుమార్ గారు మా సినిమాకు చేస్తున్న సపోర్ట్ కు స్పెషల్ తెలుపుతున్నాను. హాల్ చల్ సినిమాలో మంచి రోల్ చేశాను. అద్భుతమైన స్క్రిప్ట్ తో ఈ సినిమా ఆడియన్స్ దగ్గరకు రాబోతోంది. ఈ సినిమాను థియేటర్ లో చూడండి ప్లీజ్ పైరసీని ఎంకరేజ్ చేయొద్దని తెలిపారు.