Advertisementt

‘సినిమా కథా చిత్రమ్’ ఆడియో విడుదల

Fri 03rd Jan 2020 09:08 AM
cinema katha chitram,movie,audio,launch,details  ‘సినిమా కథా చిత్రమ్’ ఆడియో విడుదల
Cinema Katha Chitram Movie Audio Released ‘సినిమా కథా చిత్రమ్’ ఆడియో విడుదల
Advertisement
Ads by CJ

‘సినిమా కథా చిత్రమ్’ ఆడియో లాంచ్

‘వంశం’ చిత్రానికి 13 అవార్డ్స్ సొంతం చేసుకున్న దర్శకుడు రామ్ మధుసూదన్ దర్శకత్వంలో వస్తోన్న తాజా చిత్రం ‘సినిమా కథా చిత్రమ్.’ రామ్ ఫిలిమ్స్ పతాకంపై మదన్మోహన్ నాయుడు, జి. తిమ్మా రెడ్డి గౌడ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  రుషి లక్ష్మణ్, ఉమేష్, సాయికుమార్, జాకీ షరాఫ్, షీనా రాయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కన్నడ, తెలుగు భాషల్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఆడియో లాంచ్ బుధవారం ప్రసాద్ లాబ్స్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టి.రామసత్యనారాయణ, మోహన్ గౌడ్, సాయివెంకట్ విచ్చేశారు.  

టి. రామసత్యనారాయణ మాట్లాడుతూ... వంశం, ప్రేమ చరిత్ర  లాంటి మంచి చిత్రాలు చేశారు. వంశం చిత్రానికి ఏకంగా 13 అవార్డ్స్ తీసుకున్నారు. ఇక ‘సినిమా కథా చిత్రమ్’  సాంగ్స్ ,  ట్రైలర్ బావున్నాయి. రామ్ మధుసూదన్ సినిమాలు టెక్నికల్ వాల్యూస్ తో ఉంటాయి. ఈ సినిమా పెద్ద  సక్సెస్ అవ్వాలన్నారు.

లయన్ సాయి వెంకట్ మాట్లాడుతూ... రామ్ మధుసూదన్ గారు ఎన్నో మంచి సినిమాలు తీశారు. ఈ సినిమా ట్రైలర్. పాటలు బావున్నాయి. సినిమా పెద్ద సక్సెస్ కావాలన్నారు.

మోహన్ గౌడ్ మాట్లాడుతూ ... ట్రైలర్ చూసాక మంచి హార్రర్ సినిమా అని తెలుస్తోంది. పాటలు కూడా బావున్నాయి. మంచి టైటిల్ పెట్టారు. టీం అందరికి నా శుభాకాంక్షలు అన్నారు.  

నటుడు ఉమేష్ మాట్లాడుతూ... డైరెక్టర్, ప్రొడ్యూసర్ నాకు మంచి మిత్రులు. ఈ సినిమాలో నేను మంచి క్యారక్టర్ చేశాను. తెలుగు, కన్నడ రెండు భాషల్లో మంచి సక్సెస్ కావాలన్నారు.

నిర్మాత  జి. తిమ్మా రెడ్డి గౌడ్ మాట్లాడుతూ ... డైరెక్టర్ రామ్ మధుసూదన్ మంచి  కాన్సెప్ట్ తో సినిమా చేసారు. ఎక్కడా  రాజీ పడకుండా తెలుగు, కన్నడ భాషల్లో నిర్మించాము. జాకీ స్రాఫ్ గారు, సాయికుమార్ గారు చాలా సపోర్ట్ చేశారు. మా సినిమాను తెలుగు ప్రేక్షకులు సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాం అన్నారు.  

డైరెక్టర్ రామ్ మధుసూదన్ మాట్లాడుతూ ... వంశం చిత్రానికి 13 అవార్డ్స్ వచ్చాయి. రామానాయుడు గారు అప్పట్లో పిలిచి అభినందించడమే కాకుండా మనం కలిసి సినిమా చేద్దాం అన్నారు. కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదు. ఇక ఆ తర్వాత చాలా సినిమాలు చేశాను. లేటెస్ట్ గా రుషిని హీరోగా పరిచయము చేస్తూ ‘సినిమా కథా చిత్రమ్’ చేశాను.  అన్ని కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తాము అన్నారు. 

Cinema Katha Chitram Movie Audio Released:

Cinema Katha Chitram Movie Audio Launch details

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ