Advertisementt

‘సరిలేరు’ను వెంటాడుతున్న 39 మినిట్స్ టెన్షన్!

Fri 03rd Jan 2020 09:07 AM
mahesh babu,rashmika mandanna,sarileru neekevvaru,39 minutes,tension  ‘సరిలేరు’ను వెంటాడుతున్న 39 మినిట్స్ టెన్షన్!
Sarileru neekevvaru.. 39 Minutes Tension.. Tension ‘సరిలేరు’ను వెంటాడుతున్న 39 మినిట్స్ టెన్షన్!
Advertisement
Ads by CJ

టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు, రష్మిక మందన్నా నటీనటులుగా హిట్ చిత్రాల దర్శకుడిగా పేరుగాంచిన అనీల్ రావిపూడి తెరకెక్కిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమాలో కామెడీతో పాటు యాక్షన్ కూడా అదిరిపోయేలా ఉండటంతో సెన్సార్ బోర్డ్ U/A సర్టిఫికేట్ ఇచ్చింది. సినిమా అంతా సూపర్‌గా వచ్చిందని.. కచ్చితంగా ‘మహర్షి’లాగా సరిలేరు కూడా సూపర్ డూపర్ హిట్టవుతుందని చిత్రబృందం భావిస్తోందట. అంతా ఓకే కానీ టీమ్‌కు మాత్రం కొత్త టెన్షన్ పట్టుకుందట. ఆ 39 మినిట్స్ సినిమా ఎలా ఉంటుందో ఏమో..? ఇది సినిమాకు ప్లస్ అవుతుందో..? మైనస్ అవుతుందో అని చిత్రబృందానికి టెన్షన్ స్టార్ట్ అయ్యిందట.

ఆ 39 మినిట్స్ ఏమున్నాయ్..!?

సినిమాలో యాక్షన్, కామెడీకి మాత్రం కొదువలేదట. అయితే.. ఒకట్రెండు కాదు ఏకంగా 39 నిమిషాల పాటు ట్రైన్ ఎపిసోడ్ ఉందట. మాస్ మహారాజ్ రవితేజ ‘వెంకీ’ సినిమాలో ట్రైన్ ఎపిసోడ్ ఉంటుంది కదా.. దాన్ని దృష్టిలో పెట్టుకుని ‘సరిలేరు..’లో ట్రైన్ ఎపిసోడ్ పెట్టాడట డైరెక్టర్. వాస్తవానికి ఈ ఎపిసోడే సినిమాకు ప్లస్ అవుతుందని ఒక్కోసారి అనిపిస్తున్నప్పటికీ మరోసారి మాత్రం.. అబ్బే అదేముండదు.. ఈ సీన్సే కడుపులు చెక్కలైపోయేలా ప్రేక్షకులను నవ్విస్తాయో లేదో అని భయం పట్టుకుందట. ఈ ఎపిసోడ్‌లో మొత్తం బండ్ల గణేష్, జబర్దస్త్ కమెడియన్స్ సీన్లే ఉంటాయట. పంచ్‌లు బాగుంటాయట.. కానీ ఏదో తెలియని టెన్షన్ మాత్రం డైరెక్టర్‌ను వెంటాడుతూనే ఉందట. 

ఈ సినిమాలో బండ్ల దొంగ పాత్రలో నటిస్తున్నట్లు ఇప్పటికే లీకులు వచ్చాయ్. ఇప్పటికే సినిమా మ్యూజిక్ డైరెక్టర్ మొదలుకుని సెన్సార్ సర్టిఫికెట్ వచ్చేంతవరకూ రూమర్స్‌ మాత్రం గట్టిగానే వచ్చాయ్. తాజాగా 39 మినిట్స్ టెన్షన్ టెన్షన్ మరో పుకారు షికారు చేస్తోంది. మరి ఇందులో నిజానిజాలెంత..? నిజంగానే సీన్స్ ఉన్నాయా..? లేకుంటే ఇది పుకారుగానే మిగిలిపోతుందా..? అనేది తెలియాలంటే సంక్రాంతి వరకు వేచి చూడాల్సిందే.

Sarileru neekevvaru.. 39 Minutes Tension.. Tension:

Sarileru neekevvaru.. 39 Minutes Tension.. Tension  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ