‘మా’ లో లుకలుకలు మరోసారి మీడియా ముందే బహిర్గతమయ్యాయి. నిన్నమొన్నటి వరకు ‘మా’లో విభేదాలనే ప్రచారం జరగడం తప్ప లైవ్ లో కనబడలేదు. నేడు ‘మా’ డైరీ ఆవిష్కరణలో ‘మా’ విభేదాలు ఏ రేంజ్ ఉన్నాయో మీడియా ముందే బయటపడ్డాయి. హీరో రాజశేఖర్ ఎప్పటినుండో ‘మా’ అధ్యక్షడు నరేష్ మీద విరుచుకుపడుతున్నాడు. తాజాగా చిరు, మోహన్ బాబు, కృష్ణం రాజు సమక్షంలో రాజశేఖర్ మరోసారి ‘మా’ విభేదాలను కెలికేసాడు. ‘మా’లో మంచి ఉంటే బయటికి చెబుదాం, చెడు ఉంటె చెవిలో చెబుదాం అన్న మాటకి రాజశేఖర్ అంతెత్తున లేవడమే కాదు... పరుచూరి గోపాలకృష్ణ దగ్గర మైక్ లాక్కుని.. ఇలా ‘మా’ లో జరిగే గొడవలని దాస్తే దాగవని, నిప్పులేనిదే పొగ రాదని, తాను సినిమాలు మానేసి... ‘మా’ గురించే ఆలోచించి యాక్సిడెంట్ కూడా చేసానని, తన కుటుంబంలో ‘మా’ వలన గొడవలు కూడా జరిగాయని... స్టేజ్ దిగి వెళ్లిపోవడంతో .. మైక్ అందుకున్న చిరు సభా మర్యాదని పాటించకుండా గౌరవం లేకుండా పెద్దాయన దగ్గర మైక్ లాక్కోవడం క్రమశిక్షణ తప్పడమే అని.. ‘మా’ యాక్షన్ కమిటీ రాజశేఖర్ మీద యాక్షన్ తీసుకోవాలని ఇంకా పెద్దలని మమ్మల్ని పిలిచి ఇలా అవమానించడం కరెక్ట్ కాదని చిరు మాట్లాడాడు. ఇక చిరుని మోహన్ బాబు సపోర్ట్ చెయ్యడం, కృష్ణం రాజు కూడా రాజశేఖర్ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పారు.
చిరంజీవికి కోపం కూడా వచ్చింది. మమ్మల్ని పిలిచి గొడవలని సరిచెయ్యమని.. అడిగారని, మంచి బయటికి చెప్పి చెడు ని సామరస్యంగా సరిచెయ్యమని చెబితే అది ఆయనకి నచ్చలేదని అన్నారు. ఇక రాజశేఖర్ కూడా చిరుకి పంచ్ ల మీద పంచ్ లు వెయ్యడం శివాజీ రాజా, శ్రీకాంత్ వాళ్ళు ‘మా’ ని బాగా నడిపిస్తే మేమంతా వాళ్ళని ఎదుర్కొని నిలబడి గెలిచామని, వారు తప్పు చేయకపోతే మేము గెలవమని.. కానీ చిరు గారేమో వారు బాగా చేసారని చెప్పడం బాగోలేదని అనడమే కాదు.. హఠాత్తుగా అక్కడినుండి రాజశేఖర్ వెళ్లిపోవడం మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. కానీ చిరు మాత్రం నా మాటకి విలువివ్వలేదని... గౌరవం ఇవ్వలేని వాళ్లతో మాట్లాడడం కష్టమని... రాజశేఖర్‌పై తన అసహనం వ్యక్తం చేసారు.