Advertisementt

పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ స్టేజ్‌లో ‘ఏమైపోయావే’

Thu 02nd Jan 2020 11:06 PM
emai poyave movie,post production,emai poyave update,director murali  పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ స్టేజ్‌లో ‘ఏమైపోయావే’
Emai Poyave Movie in Post Production పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ స్టేజ్‌లో ‘ఏమైపోయావే’
Advertisement
Ads by CJ

పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటున్న‌ ఫీల్ గుడ్ ల‌వ్ స్టోరి ‘ఏమైపోయావే’!

శ్రీ రామ్ క్రియేషన్స్, వి.యం స్టూడియోస్‌ పతాకాలపై హరి కుమార్ నిర్మాతగా రాజీవ్ సిద్దార్ధ్, భ‌వాని చౌద‌రి శాణు మజ్జారి హీరోహీరోయిన్లుగా మురళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఏమైపోయావే’. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. 

ఈ సంద‌ర్భంగా దర్శకుడు మురళి మాట్లాడుతూ.. ‘‘మా ‘ఏమైపోయావే’ చిత్ర యూనిట్ త‌ర‌పున అంద‌రికీ నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు. ఏమైపోయావే ఒక స్వచ్ఛమైన భావోద్వేగ చిత్రం. మంచి కంటెంట్‌తో ట్రై యాంగిల్ లవ్ స్టోరీ గా మీ ముందుకు రాబోతుంది. చిత్రీకరణ కొత్తగా ఉండి ఆడియన్స్‌ని థ్రిల్ చేస్తుంది. రాజీవ్ సిద్దార్ధ్, భ‌వాని చౌద‌రి. శాణు మజ్జారి కొత్తవారైనా వారి క్యారెక్ట‌ర్స్‌కి యాప్ట్ అనిపించుకునేలా చ‌క్క‌గా న‌టించారు. మా నిర్మాత హరి కుమార్ గారు మేకింగ్ లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు. సినిమా అవుట్ పుట్ చాలా బాగా వస్తోంది. కంప్లీట్ మూవీని మీరు త‌ప్ప‌కుండా ఎంజాయ్ చేస్తార‌నే న‌మ్మ‌కం ఉంది. షూటింగ్ పూర్త‌య్యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే మీ ముందుకు తీసుకొని వ‌స్తాం’’ అన్నారు.

నిర్మాత హరి కుమార్ మాట్లాడుతూ.. ‘‘మా బేనర్ లో ఒక మంచి ఫీల్ గుడ్ ఎంటర్టైనర్‌గా ‘ఏమైపోయావే’ రూపొందుతుంది. మురళి గారు ఎంతో ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ లా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్స్‌ అందరూ కొత్తవారైనా మంచి సపోర్ట్ లభిస్తోంది. త్వరలోనే విడుద‌ల తేదీని ప్ర‌క‌టిస్తాం’’ అన్నారు.

రాజీవ్ సిద్దార్ధ్, భ‌వాని చౌద‌రి, శాణు మజ్జారి, మిర్చి మాధవి, సునితా మ‌నొహ‌ర్‌, భాషా, నామల మూర్తి, మీసం సురేష్, మ‌ళ్ళీరావా బుజ్జి త‌దిత‌రులు నటిస్తున్న ఈ చిత్రానికి

స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మురళి,

నిర్మాత: హరి కుమార్ ,

డి.ఓ.పి: శివరాథోడ్,

మ్యూజిక్: రామ్ చరణ్,

కథ, మాటలు: శాంతి పుత్ర విజయ్,

పాటలు: తిరుపతి జానవ,

పిఆర్ఓ: సాయి స‌తీశ్‌.

Emai Poyave Movie in Post Production:

Emai Poyave Movie Latest Update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ