Advertisementt

జక్కన్న.. ఇలా చేయడం ఏం బాగోలేదు

Thu 02nd Jan 2020 08:51 PM
ss rajamouli,jakkanna,rrr,new year eve,first look,fans,mega,nandamuri  జక్కన్న.. ఇలా చేయడం ఏం బాగోలేదు
Mega and Nandamuri Fans Disappointed with Rajamouli Decision జక్కన్న.. ఇలా చేయడం ఏం బాగోలేదు
Advertisement
Ads by CJ

న్యూ ఇయర్ అంటే... కొత్త సినిమాల పోస్టర్స్, టీజర్స్ ఇలా టాలీవుడ్ లో హంగామా మాములుగా ఉండదు. హీరోల ఫ్యాన్స్ అయితే తమ అభిమాన హీరో పోస్టర్ వస్తుంది అంటే చాలు పెద్ద ఎత్తున సంబరాలకు దిగుతారు. అయితే ప్రస్తుతం ఈ ఏడాది విడుదలకాబోతున్న భారీ బడ్జెట్ అండ్ క్రేజ్ ఉన్న చిత్రం RRR సినిమా నుండి కొత్త పోస్టర్ కానీ.. మరేదన్న అప్ డేట్ కానీ వస్తుంది అని ఎదురు చూస్తున్న ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ కి రాజమౌళి షాకిచ్చాడు. గత నాలుగైదు రోజుల నుండి RRR సినిమా న్యూ ఇయర్ స్పెషల్ ట్రీట్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

ఇక RRR టీం కూడా ట్విట్టర్ లో అలా అలా హడావిడి చేస్తుంది. 2020 న్యూ ఇయర్ వచ్చేసింది. కానీ RRR అప్ డేట్ లేదు.. కొత్త పోస్టర్ లేదు. గతంలో విడుదల చేసిన ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫస్ట్ లుక్ పోస్టర్ మీద హ్యాపీ న్యూ ఇయర్ అంటూ వేసి వదిలారు. దానితో మెగా, ఎన్టీఆర్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. జక్కన్న ఫ్యాన్స్ ని మోసం చేసావంటూ సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న చిత్రం కాబట్టి న్యూ ఇయర్ స్పెషల్ ట్రీట్ ఉంటే బావుంటుంది అని ఫ్యాన్స్ భావించి.. నాలుగైదు రోజుల నుండి RRR పోస్టర్ అండ్ అప్ డేట్ కోసం ఎదురు చూస్తుంటే జక్కన్న మాత్రం ఇలా చెయ్యడం ఏం బాగోలేదు.

Mega and Nandamuri Fans Disappointed with Rajamouli Decision:

Mega and Nandamuri Fans Hurted with SS Rajamouli way

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ