నూతన సంవత్సర శుభాకాంక్షలతో ‘విశ్వక్’ ఫస్ట్ లుక్ విడుదల
అజయ్ కథుర్వర్, డింపుల్ హీరో హీరోయిన్లుగా గోల్డెన్ డక్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వేణు ముల్కల దర్శకత్వంలో తాటికొండ ఆనందం బాలక్రిషన్ నిర్మిస్తోన్న చిత్రం ‘విశ్వక్’. నూతన సంవత్సరం సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఫస్ట్ లుక్‌లోని పేపర్ కటింగ్స్, వాటిని ఓ బోర్డ్‌కు పిన్ చేసినట్లు ఉండటం.. ఇవన్నీచూస్తుంటే ‘విశ్వక్’ ఒక డిఫరెంట్ మూవీ అనే ఆసక్తిని రేపుతుంది.
ప్రపంచ వాణిజ్యాన్ని శాసించే స్టార్టప్ కంపెనీల కథాంశంతో విశ్వక్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇండియాలో ప్రారంభమైన కొన్ని స్టార్టప్ కంపెనీలు, వాటిని స్థాపించిన యువత ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నారు. అర్బన్ ఇన్‌ఫ్రా స్ట్రక్చర్ ఎలా ఉంటుందనే అంశాన్ని కూడా ఈ సినిమా చూపించబోతున్నారు. సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా టీజర్‌ను త్వరలోనే విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. స్టైలిష్‌గా, నేటి తరానికి తగ్గట్లు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి సత్యసాగర్ సంగీతం, ప్రదీప్ దేవ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
నటీనటులు:
అజయ్ కథుర్వర్, డింపుల్ తదితరులు
సాంకేతిక వర్గం:
ప్రొడక్షన్: గోల్డెన్ డక్ ప్రొడక్షన్
నిర్మాత: తాటికొండ ఆనందం బాలక్రిషన్
దర్శకత్వం: వేణు ముల్కల
సినిమాటోగ్రఫీ: ప్రదీప్ దేవ్
సంగీతం: సత్యసాగర్ పొలం
ఎడిటర్: కె.విశ్వనాథ్
పి.ఆర్.ఓ: వంశీ శేఖర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రవికాంత్ జలగం
లైన్ ప్రొడ్యూసర్: ఎం.ఉదయ్ భాస్కర్
ప్రొడక్షన్ మేనేజర్: అల్లూరి చంద్రశేఖర్