ప్రస్తుతం సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ సీజన్ 13 హోస్ట్ గా అదరగొట్టేస్తున్నాడు. కానీ సినిమాల్లోనే వెనకబడిపోతున్నాడు. గత కొన్నాళ్లుగా సరయిన సినిమాతో బాక్సాఫీసు వద్ద సత్తా చాటలేకపోతున్నాడు సల్మాన్. భారీ ఫాలోయింగ్ తో ఉన్న సల్మాన్ సినిమా ప్లాప్ అయినా.. కలెక్షన్స్ తో నిర్మాతలు సేవ్ అవుతున్నారు కానీ.. లేదంటే సల్మాన్ తో సినిమాలు చేసిన నిర్మాతలు నెత్తి మీద చెంగేసుకోవాల్సిందే. తాజాగా దబాంగ్ 3 తో క్రిస్టమస్ ని ఆడేసుకుందామనుకుంటే దబాంగ్ 3 కి ప్లాప్ టాక్ పడడంతో కనీసం 200 కోట్ల క్లబ్బులోకి కూడా చేరుకోలేకపోయాడు సల్మాన్. ఇక ఈ ఏడాది వరసబెట్టి హిట్స్ తో ఫామ్ లోకొచ్చేసిన అక్షయ్ కుమార్ దబాంగ్ 3 ని తన గుడ్ న్యూస్ తో ఒణికిస్తున్నాడు.
దబాంగ్ డిసెంబర్ 20 న విడుదలైతే సరిగ్గా వారానికి అక్షయ్ గుడ్ న్యూస్ విడుదలై డీసెంట్ కలెక్షన్స్ కొల్లగొడుతూ దబాంగ్ కి చెక్ పెట్టింది. ఈ ఏడాది యావరేజ్ టాక్ తోనే హౌస్ ఫుల్ 4 కి హిట్ కలెక్షన్స్ తెచ్చిన అక్షయ్ కుమార్, మిషన్ మంగళ్ తో హిట్ కొట్టాడు. ఇంకా తాజాగా గుడ్ న్యూస్ తో కరీనా కపూర్, కియారాలతో కలిసి భారీ హిట్ అందుకున్నాడు. మరి ఎంతో క్రేజున్న సల్మాన్ దబాంగ్ కూడా చిన్నబోయేలా గుడ్ న్యూస్ థియేటర్స్ కళకళలాడుతున్నాయి. ఫస్ట్ వీకెండ్ లోనే 100 కోట్లు కొల్లగొట్టిన గుడ్ న్యూస్ ఫస్ట్ వీక్ ముగిసేసరికి 200 కోట్లు కొల్లగొట్టడం ఖాయంగా కనబడుతుంది. దబాంగ్ 3 వసూళ్లు సాంతం పడిపోయాయి.
ఇక ఇప్పుడే కాదు.. వచ్చే రంజాన్ కి సల్మాన్ కి ఎదురెలుతున్నాడు అక్షయ్. ఎప్పుడూ రంజాన్ హీరో అనిపించుకునే సల్మాన్ కి అక్షయ్ కుమార్ సూర్యవంశీతో చెక్ పెట్టడానికి రెడీ కాబోతున్నాడు. సల్మాన్ ఖాన్ వచ్చే రంజాన్ కి రాధెను బరిలో దించగా, అక్షయ్ కుమార్ తన సూర్యవంశీతో సల్మాన్ తో పోటీకి సై అంటున్నాడు.