ఎప్పుడెప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి అడుగుపెడతాడా అని ఎదురు చూస్తున్నారు పవన్ ఫ్యాన్స్. అందుకే పవన్ స్టయిల్ మార్చాడనగానే సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ ని తెగ వెదికేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ కోసం స్టయిల్ మార్చాడనుకుంటున్నారా.. కాదండి.. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో చేసే ప్రసంగంలో స్టయిల్ మార్చాడు. ప్రస్తుతం ఏపీ రాజధాని వ్యవహారంపై అమరావతి ప్రజలంతా హాట్ హాట్ గా ఉంటే.. పవన్ కళ్యాణ్ రాజధాని రైతులకు భరోసా ఇవ్వడానికి అమరావతి వెళ్ళాడు. మరి పవన్ కళ్యాణ్ అమరావతికి రాకుండా.. ముళ్ళ కంచెలు, పోలీసులు అడ్డం పడినా పవన్ కళ్యాణ్ రైతుల దగ్గరకు చేరుకోవడమే కాదు... తన ప్రసంగంతో ప్రజలకు పంచ్ లిస్తూ... ఏపీ సీఎం జగన్ ని ఆడుకున్నాడు. ఒక్క అవకాశం ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి అంటే ఇచ్చారు జగన్ ని సీఎంని చేసారు. మరి నాకో అవకాశం ఇవ్వండి అంటే ఇవ్వలేదు.
నేను మీకు భరోసా అంటే నాకు ఓటేయ్యలేదు. ఇప్పుడు అమరావతిని రక్షించండి అంటూ అడిగితే నేనేం చెయ్యగలను అంటూ పంచ్ వెయ్యడమే కాదు.. పవన్ కళ్యాణ్ క్రైస్తవ మతపెద్దలు పాస్టర్లు మాట్లాడినట్లుగా తన హావభావాలతో స్పీచ్ ఇస్తూ రాజకీయాల్లో స్టయిల్ మార్చాడా అనిపించే పవన్ ప్రసంగంలో మార్పు కనిపించింది. పాస్టర్లు క్రైస్తవులను ఉద్దేశించి ప్రసంగాలు చేసినట్టుగా పవన్ కళ్యాణ్ కూడా పాస్టర్లని ఇమిటేట్ చేస్తూ మాట్లాడడం మాత్రం ఆకట్టుకుంది. ఇక పవన్ కళ్యాణ్ ఈ జనవరి నుండి పింక్ రీమేక్ కోసం తయారవుతున్నారు. రాజకీయాల్లో ఏకాకిగా మిగిలిన పవన్ ఇక సినిమాలపై ఫోకస్ పెట్టబోతున్న విషయం తెలిసందే. పవన్ రీ ఎంట్రీ ఫిల్మ్ గా పింక్ రీమేక్ తెరకెక్కబోతుంది. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ కొత్తగా మేకోవర్ అవ్వడం లేదు. ప్రస్తుతం ఉన్న గెడ్డం, సేమ్ లుక్ లోనే పవన్ లాయర్ అవతారమెత్తనున్నాడని టాక్.