బాహుబలి సినిమాతో తన సత్తా ఏంటో యావత్ ప్రపంచానికి చాటిచెప్పిన దర్శకధీరుడు రాజమౌళి అలియాస్ జక్కన్న తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘RRR’. ఈ చిత్రంలో స్టార్ హీరోలుగా ఓ వెలుగు వెలుగుతున్న మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ నటిస్తున్నారు. ఇప్పటికే సుమారు 70% సినిమాకు పైగా షూటింగ్ అయిపోయింది. అయితే ఈ సినిమా పూర్తయితే ఎన్టీఆర్, చెర్రీ పరిస్థితేంటి..? వేరే డైరెక్టర్‌కు ఏమైనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా..? లేకుంటే ఐ వాంట్ రెస్ట్ అంటూ ఏడాది పాటు మిన్నకుండిపోతారా..? అనేది ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది.
కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని.. మరోవైపు అట్లీకుమార్, త్రివిక్రమ్‌లు కూడా జూనియర్ కోసం వెయిటింగ్‌లో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. చెర్రీ కోసం కూడా నలుగురైదుగురు డైరెక్టర్స్ వెయిటింగ్‌లో ఉన్నారట. సందీప్ రెడ్డి వంగా, హరీశ్ శంకర్‌తో పాటు ఒకరిద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. అయితే వీరందరికంటే ముందుగా హరీశ్‌కు చెర్రీ అవకాశమిచ్చారని.. అందుకే ఇప్పుడు ఆయన కథ సిద్ధం ఫైనల్ చేసే పనిలో ఉన్నారని టాక్ నడుస్తోంది.
వాస్తవానికి మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన పవన్, సాయిధరమ్ తేజ్, అల్లు అర్జున్‌తో హరీశ్ శంకర్ సినిమాలు చేసి.. అందరికీ సూపర్ డూపర్ హిట్ ఇచ్చాడు. అందుకే తనకు కూడా కచ్చితంగా హిట్టిస్తాడని నమ్మిన చెర్రీ.. హరీశ్‌కు ఫస్ట్ చాన్స్ ఇచ్చారట. అన్నీ అనుకుంటే.. ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ అయిన తర్వాత లేదా.. రిలీజ్ తర్వాత అధికారికంగా ప్రకటించి షూటింగ్ షురూ చేయాలని భావిస్తున్నారట. మరి ఇందులో నిజానిజాలెంతో తెలియాల్సి ఉంది.