Advertisementt

వామ్మో.. రెజీనా గురించి ఎన్నెన్ని పుకార్లో..!?

Tue 31st Dec 2019 10:34 PM
rumors,actress regina cassandra,megastar chiranjeevi,tamil movie  వామ్మో.. రెజీనా గురించి ఎన్నెన్ని పుకార్లో..!?
Huge Rumors On Actress Regina Cassandra వామ్మో.. రెజీనా గురించి ఎన్నెన్ని పుకార్లో..!?
Advertisement
Ads by CJ

టాలీవుడ్‌లో అందం, అభినయం కలగలిసిన కథానాయికల్లో రెజీనా ఒకరని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎలాంటి పాత్రలో అయినా నటించమంటే జీవించేయడంలో ఈ ముద్దుగుమ్మ ముందు వరుసలో ఉంటుంది. అలా ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో వరుసగా సినిమాలు చేసిన ఈ బ్యూటీకి తర్వాత కొన్నిరోజుల పాటు అడ్రస్ లేకుండా పోయింది. అయితే మళ్లీ క్రీజులోకి ఈ భామ ‘ఎవరు’ సినిమాతో తనెవరో తన రేంజేంటో టాలీవుడ్ ప్రేక్షకులు తెలియజేసింది. ఇక అసలు విషయానికొస్తే రెజీనా గురించి పుకార్లు షికార్లు చేయడం ఇవాళేం కొత్త కాదు. సినిమాల విషయాలు మొదలుకుని లవ్, డేటింగ్, నిశ్చితార్థం, పెళ్లి ఇలా పలు విషయాల్లో ఈ ముద్దుగుమ్మ వార్తల్లో నిలిచింది. అయితే వీటిలో కొన్నింటిపై స్పందించి ఆమె క్లారిటీ కూడా ఇచ్చుకుంది.

అలా ఇక మళ్లీ పాత రోజులొచ్చాయని.. సినిమాలతో బిజిబిజీగా ఉన్న రెజీనాపై మరోసారి కొన్ని పుకార్లు రేగాయి. త్వరలో తమిళంలో ఓ సినిమాలో నటించనున్నది అనే వార్త ఒక్కటి కాగా.. మెగాస్టార్ చిరంజీవి సరసన నటిస్తోందని.. అది కూడా ఐటెం సాంగ్‌లో నర్తించడానికి ఈ ముద్దుగుమ్మ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గత మూడ్రోజులుగా రెజీనాకు సంబంధించిన ఈ రెండు పుకార్లు అటు టాలీవుడ్‌లో ఇటు కోలీవుడ్‌లో షికార్లు చేస్తున్నాయి.

ఈ రెండు నిజమేనా..!? 

తమిళ సినిమాలో జోష్యం చెప్పే పాత్రలో ఈ ముద్దుగుమ్మ నటిస్తోందని.. అయితే ఈ పాత్ర, సినిమా హిట్టయితే మంచి పేరు వస్తుందని.. ఇక మనకు తిరుగే ఉండదని రెజీనా భావిస్తోందట. అంతేకాదు.. ఈ ఒక్కటి సూపర్ డూపర్ హిట్టయితే మంచి మంచి అవకాశాలు కూడా వస్తాయని రెజీనా వేయి కళ్లతో వేచి చూస్తోందట. ఇవన్నీ అటుంచితే.. చిరు-కొరటాల కాంబోలో వస్తున్న చిత్రంలో మెగాస్టార్‌తో కలిసి రెజీనా స్టెప్పులేయనుందనేది ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి చిరు సరసన రొమాంటిక్ సాంగ్‌కు మొదట చాలా మంది క్రేజీ హీరోయిన్లను అనుకున్నా.. రెజీనానే ఫైనల్ చేశారట. ఇప్పటికే రెజీనాపై బోలెడన్నీ రూమర్స్‌ రాగా.. తాజాగా మళ్లీ రూమర్స్‌.. ఇలా ఇంకా ఎన్నెన్ని రూమర్స్ వస్తాయో ఏంటో మరి.

Huge Rumors On Actress Regina Cassandra:

Huge Rumors On Actress Regina Cassandra

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ