ప్రభాస్ తాజా చిత్రం ‘సాహో’ భారీ అంచనాల మధ్యన వచ్చి భారీ డిజాస్టర్ అయినాసంగతి తెలిసిందే. హిందీలో హిట్ అయిన ‘సాహో’ని తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు ఒప్పుకోలేదు. ఇక్కడ దారుణమైన వసూళ్లతో ‘సాహో’ ప్లాప్ లిస్ట్ లోకెళ్ళిపోయింది. అయితే సాహో సినిమాని ప్రభాస్ ఫ్రెండ్స్ యూవీ క్రియేషన్స్ వారు నిర్మించారు. సాహో విడుదలకు ముందు భారీ హైప్ నెలకొనడంతో.. వారు సాహో బిజినెస్ విషయంలో... భారీ లాభాలను మూటగట్టుకోవాలని డిసైడ్ అయ్యారు. అందుకే సాహో శాటిలైట్ విషయంలో యూవీ వారు సాహో హక్కులకు భారీ ధర చెప్పగా... తెలుగు ఛానల్స్ చెయ్యని సాహసం హిందీ ఛానల్ వారుచెయ్యడం.. హిందీ శాటిలైట్ హక్కులకు భారీ లాభం రావడం జరిగింది.
ఇక తెలుగులో సాహో కి చెప్పిన రేటుకు ఎవరూ సాహో శాటిలైట్ కొనడానికి ముందుకు రాకపోవడంతో.. యూవీ వారు సినిమా హిట్ అయితే వారే కొంటారు ఎక్కడికి పోతారనుకున్నారు. కానీ సినిమా విడుదలై అమెజాన్ ప్రైమ్ లో కూడా వచ్చేసింది. ఇంతవరకు సాహో శాటిలైట్ బిజినెస్ జరగలేదు. ఆ సినిమా కొచ్చిన టాక్ తోనూ, ఆల్రెడీ అమెజాన్ లో విడుదల చేసిన సాహో సినిమాని ఎవరూ కొనే సాహసం చేయకపోవడంతో... సాహో కి ఇంతవరకు శాటిలైట్ బిజినెస్ జరగలేదు. మరి ఇపుడు యూవీ వారు రేటు తగ్గించి ఇస్తామన్నా ఛానల్స్ ఇంట్రెస్ చూపడం లేదనే టాక్ ఫిలింసర్కిల్స్ లో స్ప్రెడ్ అయ్యింది. బాహుబలి తో భారీ క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ సాహో కి ఇలా జరగడం మాత్రం ఘోరమనే చెప్పాలి.