Advertisementt

ప్రేక్షకులు, ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేస్తున్న ‘డాంగ్ డాంగ్’

Mon 30th Dec 2019 09:38 PM
daang daang,sarileru neekevvaru,mahesh babu,tamannaah,anil ravipudi,dsp  ప్రేక్షకులు, ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేస్తున్న ‘డాంగ్ డాంగ్’
Fans Mesmerized with Sarileru Neekevvaru Movie Daang Daang Song ప్రేక్షకులు, ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేస్తున్న ‘డాంగ్ డాంగ్’
Advertisement
Ads by CJ

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి.ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకాలపై యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న అవుట్‌ అండ్‌ అవుట్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌ ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్‌ విజయశాంతి నటిస్తున్నారు.  ఇప్ప‌టికే  విడుదలైన టీజర్‌, మాస్‌ సాంగ్‌, మెలొడి సాంగ్, రొమాంటిక్ సాంగ్‌కి టెర్రిఫిక్‌ రెస్పాన్స్‌ రాగా చిత్రం నుండి డాంగ్ డాంగ్  ఫుల్ లిరిక‌ల్‌ సాంగ్‌ను ఈ రోజు సాయంత్రం 05.04 గంటలకు విడుదల చేసింది చిత్ర యూనిట్.

   ఆజ్ రాత్ మేరే గ‌ర్ మే పార్టీ హై తు ఆజానా... అంటూ సాగే ఈ పార్టీ సాంగ్ మహేశ్‌, త‌మ‌న్నాల‌పై అమేజింగ్ స్టెప్స్‌తో అభిమానులు, ప్రేక్ష‌కులను ఆక‌ట్టుకునేలా కంపోజ్ చేశారు. ఈ సాంగ్‌లో మిల్కీబ్యూటీ త‌మ‌న్నాతో అదిరిపోయే స్టెప్పులేశారు సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌. ఈ న్యూ ఇయ‌ర్‌కి ఫ్యాన్స్‌కి మంచి ఊపునిచ్చే పాటను ఇచ్చి వారిలో జోష్ నింపాడు దేవి శ్రీ. ఈ సాంగ్ రేపు థియేటర్ లో అదరగొట్టడం ఖాయం అని సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శేఖ‌ర్ మాస్ట‌ర్ నృత్య‌రీతులను కంపోజ్ చేశారు. ఈ పాట‌కు రామ‌జోగ‌య్య‌శాస్త్రి సాహిత్యాన్ని అందించ‌గా న‌కాష్ అజిజ్‌, ల‌వితా లోబో ఆల‌పించారు.

జనవరి 5 ఆదివారం సాయంత్రం 5:04నిమిషాలకు హైద‌రాబాద్ లాల్‌బహదూర్‌ స్టేడియంలో  మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా అభిమానుల సమక్షంలో గ్రాండ్‌గా ‘సరిలేరు నీకెవ్వరు మెగా సూపర్‌ ఈవెంట్`ను నిర్వహించనున్నారు. సంక్రాంతి కానుక‌గా జనవరి 11, 2020న  ప్రపంచవ్యాప్తంగా విడుద‌ల‌చేయ‌నున్నవిష‌యం తెలిసిందే..

సూపర్‌స్టార్‌ మహేష్‌, రష్మిక మందన్న, ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్‌ విజయశాంతి, రాజేంద్రప్రసాద్‌, ప్రకాష్‌రాజ్‌, సంగీత, బండ్ల గణేష్ త‌దిత‌రులు నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌, రత్నవేలు, కిశోర్‌ గరికిపాటి, అజ‌య్ సుంక‌ర‌, త‌మ్మిరాజు, రామ్‌లక్ష్మణ్‌, యుగంధర్ టి. ఎస్‌.కృష్ణ సాంకేతిక వర్గం.

Click Here for Song

Fans Mesmerized with Sarileru Neekevvaru Movie Daang Daang Song:

Sarileru Neekevvaru Movie Daang Daang Song Promo released   

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ