టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ అంతా నా ఇష్టం అంటూ.. ఎప్పుడు ఏం చేస్తాడో ఆయనకే అర్థం కాదు.. తెలియదు. సినిమాలు తీయాలన్నా.. వివాదాస్పద వ్యాఖ్యలు చేయాలన్నా.. నోటికొచ్చినట్లి వాగేయాలన్నా ఆయనకే ఆయనే సాటి.. ఆయనకెవ్వరూ లేరీ పోటీ..! అలా రోజూ ఏదో ఒకటి వివాదాస్పదంగా మాట్లాడకపోతే ఆయన కడుపు నిండదు.. తిన్నది అరగదు అన్నంతగా పరిస్థితులున్నాయ్. వాస్తవానికి సినిమా ప్రమోషన్స్ చేయడానికి ఆర్జీవీ సాహసించరు.. అలాంటి ఈ మధ్య తన శిష్యుడు అగస్త్య మంజు తెరకెక్కించిన ‘బ్యూటీఫుల్’ సినిమాకు మాత్రం తెగ ప్రచారం చేసుకుంటున్నాడు. ఇటీవలే హీరోయిన్ నైనా గంగూలితో కలిసి ఆగ్రహంతో కూడిన సంతోషంతో డ్యాన్స్ చేసిన సంగతి తెలిసిందే.! దీన్ని చూసిన ఫ్యాన్స్, వీక్షకులు వామ్మో.. ఆర్జీవీ మామూలోడు కాదు బాబోయ్ అంటూ కామెంట్స్ చేశారు. అయితే ఆ షాక్ నుంచి ఇంకా ఫ్యాన్స్ తేరుకోకముందే మరోసారి హవ్వా అనిపించారు వర్మ.
ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ‘వోడ్కా విత్ వర్మ పేరిట..’ బ్యూటిఫుల్ టీమ్ ప్రీ న్యూ ఇయర్ ప్రైవేటు పార్టీ నిర్వహించి సందడి చేసింది. ఈ కార్యక్రమంలో మరోసారి చిందులేసిన ఆర్జీవీ వావ్ అనిపించారు. చిత్రబృందంతో కలిసి డ్యాన్స్ చేసి అలిసిపోయిన్ ఆయన.. ఆఖరున నైనా గంగూలి కాళ్లపై పడ్డాడు. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆర్జీవీ తన కాళ్లమీద పడటంతో ఏం చేయాలో దిక్కుతోచక షాక్‌కు గురైంది. సార్.. సార్ అంటూ ఆమె కింద కూర్చుండిపోయింది. ఈ సందర్భంగా ఆ బ్యూటీ ఒకింత భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టినంత పని చేసింది.
అయితే ఆర్జీవీ.. మత్తెక్కువై పడ్డారో లేకుంటే.. చిన్న షాకిద్దామని ఇలా చేశాడో తెలియట్లేదు కానీ.. ప్రస్తుతం ఈ వ్యవహారం మాత్రం నెట్టింట్లో.. ఇటు వెబ్‌సైట్లలో చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంపై నెటిజన్లు, ఆర్జీవీ అభిమానులు ఓ రేంజ్‌లో చిత్రవిచిత్రాలుగా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కొందరు ఓహో కాళ్ల మీద పడటం వెనుక ఇదా సంగతి అంటుంటే.. మరికొందరేమో వర్మ నువ్ మామూలోడివి కాదయ్యా అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ విచిత్ర ఘటనపై ఆర్జీవీ సోషల్ మీడియాలో ఎలా రియాక్ట్ అవుతాడో వేచి చూడాల్సిందే మరి.