Advertisementt

పిల్లలిద్దరిదీ పవన్ రక్తం కాదు నాదే..: రేణు

Mon 30th Dec 2019 09:22 PM
pawan kalyan,renu desai,social media,childrens,blood  పిల్లలిద్దరిదీ పవన్ రక్తం కాదు నాదే..: రేణు
Renu Desai comments social media About her Childrens పిల్లలిద్దరిదీ పవన్ రక్తం కాదు నాదే..: రేణు
Advertisement
Ads by CJ

టాలీవుడ్ పవర్‌స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ సినీ ప్రియులు, జనసేన కార్యకర్తలు, అభిమానులకు కొత్త పరిచయం చేయనక్కర్లేదు. పవన్ నుంచి విడిపోయాక తన ఇద్దరి పిల్లలతో కలిసి జీవిస్తున్న ఆమె పిల్లలు, తనకు సంబంధించిన సరదా సంగతుల్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటూ అభిమానులతో టచ్‌లో ఉంటారు. అంతేకాదు.. తాను చేసిన పోస్టులకు ఎవరైనా అతిగా రియాక్ట్ అయ్యారో ఇక అంతే సంగతులు.. దుమ్ముదులిపి వదలుతుంది రేణు. అయితే.. ఇటీవల పవన్ వీరాభిమాని కాస్త అతిగా మాట్లాడటంతో తీవ్ర ఆగ్రహానికి లోనై ఘాటుగా స్పందించింది. 

రేణు పోస్ట్ ఇదీ..!

కొడుకు అకీరా తన చెల్లెలు ఆద్యని ఎత్తుకొని ఉన్న ఫోటోని షేర్ చేస్తూ.. ‘1 2 3 అని లెక్కపెట్టేలోపు నేను మీ ముందు ఉంటా.. ఆద్య, అకీరా క్రేజీ ఫెల్లోస్.. వారిద్దరూ నా సొంతం’ అంటూ క్యాప్షన్‌గా రాసుకొచ్చింది. అయితే ఈ క్యాప్షన్ రకరకాలుగా అర్థం చేసుకున్న కొందరు పవన్ వీరాభిమనులు, నెటిజన్లు అతిగా స్పందించారు. వారి కామెంట్స్‌కు రేణూ ఆగ్రహంతో ఊగిపోయింది.

నెటిజన్: రేణు క్యాప్షన్‌కు ఓ నెటిజన్ (పవన్ వీరాభిమాని ).. ‘ఎంతైనా పవన్ రక్తం కదా మేడమ్’ అని కామెంట్ చేశాడు. 

రేణు రిప్లై : ఇందుకు మళ్లీ రెండోసారి రంగంలోకి దిగిన రేణూ ఇక తన నోటికి బుద్ధి చెప్పి గట్టిగానే కౌంటరిచ్చింది. ‘సైన్స్‌ పరంగా చెప్పాలంటే వారిద్దరిలో ప్రవహించేది నా రక్తం.. మీకు సైన్స్‌ తెలిస్తే ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు’ అని స్ట్రాంగ్ కౌంటరిచ్చింది.

మరో నెటిజన్: ఫ్యాన్స్ అనగా ఎన్నెన్నో మాట్లాడుతుంటారు..? వాటినెందుకు పట్టించుకుంటారు..? 

రేణు రిప్లై : ‘అమ్మతనం గురించి వారు మాట్లాడుతూ ఉంటే నేను ఎలా మౌనంగా ఉంటాను’ అని కాసింత ఎమోషనల్‌గా రేణు ఫీలయ్యింది. 

కాగా.. నెటిజన్లు, పవన్ ఫ్యాన్స్‌తో పోరాటం రేణుకు కొత్తమీ కాదు.. ఇప్పటికే పలు విషయాల్లో అతిగా స్పందించే నెటిజన్లు, పవన్‌ ఫ్యాన్స్‌పై ఇలా పంచ్‌లు, కౌంటర్ల వర్షం కురిపించడం షరామామూలే. మొత్తానికి చూస్తే మరోసారి రేణూ తన నోటికి పనిచెప్పి ఇన్‌స్టాగ్రామ్‌లో హడావుడి చేసింది. కాగా తాజా పోస్ట్‌తో ఇటు మీడియాలో.. అటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.

Renu Desai comments social media About her Childrens:

Renu Desai comments social media About her Childrens  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ