బాలకృష్ణకి ‘కథానాయకుడు’, ‘మహానాయకుడు’ దెబ్బ ఒక ఎత్తైతే... ‘రూలర్’ దెబ్బ మరో ఎత్తు.. రూలర్ సినిమాకి 40 కోట్ల బడ్జెట్ పెడితే.. ‘రూలర్’ సినిమాకి వారానికి వచ్చిన కలెక్షన్ చూస్తే షాకవ్వాలి. వరల్డ్ వైడ్‌గా ‘రూలర్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ 7.30 గాను రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 6.50 కోట్లు రాబట్టింది అంటే... రూలర్ ఘోరమైన డిజాస్టర్ అన్నమాట. మరి కళ్యాణ్ రూలర్ శాటిలైట్, డిజిటల్ రైట్స్ అమ్మేసి సేఫ్ అయ్యాడు కానీ.. లేదంటే ఓ రేంజ్ నష్టాల్లోకి కూరుకుపోయేవాడు. అయితే రూలర్ దెబ్బ అంతా ఇంతా కాదు కాబట్టి..బాలకృష్ణ కూడా నిర్మాత కళ్యాణ్ కష్టాన్ని కన్నీళ్ళని తుడుస్తా అంటున్నాడట.
ఇప్పటికే పారితోషకం లో కొంతమొత్తం వెనక్కిస్తా అని సి. కళ్యాణ్‌కి మాటివ్వడమే కాకుండా మరో సినిమా చేసి పెడతా అంటూ మాట కూడా ఇచ్చాడట. మరి సి కల్యాణే.. గొప్పగా రూలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలయ్యతో మరో సినిమా ఉంటుందని చెప్పాడు. ఇప్పుడు బాలయ్య కూడా మాటిచ్చాడు. కానీ కళ్యాణ్ కి మాత్రం ఇప్పట్లో బాలయ్య సినిమా నిర్మించాలంటే భయపడేలా రూలర్ సినిమా చేసింది. అందుకే బాలయ్య మరో సినిమా ఆఫర్ అంటున్నా ప్రస్తుతం సి కళ్యాణ్ కి బాలయ్య తో మరో సినిమా ఆలోచనే లేనట్లుగా కనబడుతుంది. మరి భారీ ప్లాప్స్ లో ఉన్న బాలయ్య ని బోయపాటే లేపాంటున్నారు బాలయ్య ఫాన్స్. కానీ బాలయ్య - బోయపాటి సినిమా ఉంటుందా.. లేదా.. అనేది ప్రస్తుతం సస్పెన్స్ గా వుంది.