Advertisementt

కీరవాణి, జక్కన్నల నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం!

Mon 30th Dec 2019 06:31 AM
mathu vadalara success,jakkanna,keeravani  కీరవాణి, జక్కన్నల నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం!
News About Mathu Vadalara Success కీరవాణి, జక్కన్నల నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం!
Advertisement
Ads by CJ

మత్తువదలరా విషయంలో కథ బాగుంది సినిమా తీద్ధాం అని నిర్ణయం తీసుకోవడం తప్పితే ఈ రోజు సినిమా విజయంలో మా అఛీవ్‌మెంట్ ఏమీ లేదు. పూర్తి క్రెడిట్ దర్శకుడితో పాటు మిగతా చిత్రబృందానిదే. ఈ విజయం ఇచ్చిన స్ఫూర్తితో చిన్న సినిమాల్ని  ప్రోత్సహించే  ఆలోచనలో ఉన్నాం. కొత్త కథలు వింటున్నాం. ఔత్సాహికులైన నవతరం ఇండస్ట్రీకి వస్తేనే మంచి సినిమాలు వస్తాయి అంటున్నారు నిర్మాతలు రవిశంకర్, చెర్రి (చిరంజీవి). మైత్రీ మూవీ మేకర్స్ అండ్ క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన చిత్రం మత్తువదలరా. ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలతో పాటు అనూహ్య ప్రేక్షకాదరణ లభిస్తోంది. పరిమిత వ్యయంతో, ఓ వినూత్నమైన ఈ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ఈ సందర్భంగా నిర్మాతలు రవిశంకర్, చెర్రి(చిరంజీవి)లు పాత్రికేయులతో ముచ్చటించారు ఆ విశేషాలివి.

రంగస్థలం తర్వాత..

‘యంగ్ టాలెంటెడ్ టీమ్ ఈ సినిమా దొరికింది. రంగస్థలం తర్వాత మా సంస్థలో ప్రతి విభాగం స్ఫూర్తి పొంది పనిచేసిన సినిమా ఇది. దర్శకుడు కథ, కథనాలతో పాటు పాత్ర చిత్రణలు, లైటింగ్, స్టెలింగ్, సెట్స్ ప్రతి విషయంలో స్పష్టతతో ఉండటంతో అందరూ విశ్వాసంతో పనిచేశారు.  రితేష్ ఎవరి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేయకపోయినా అనుభవజ్ఞుడిలా సినిమాను తెరకెక్కించారు. పరిమిత బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించాం. డీఐ, గ్రాఫిక్స్ వర్క్స్ , కెమెరా అన్నింటిని రితేష్ బృందం సమకూర్చుకుంటూ అనుకున్న బడ్జెట్‌లో పూర్తిచేశారు.   వాటికోసం  కేవలం రెండు కంప్యూటర్స్, గ్రాఫిక్స్ కార్డ్స్ మాత్రమే వారికి మేము ఇచ్చాం.  పరిమిత వనరులతో చక్కటి నాణ్యతతో సినిమాను రూపొందించవచ్చని నిరూపించారు. పెద్ద సినిమాల్లో మాదిరిగి విజువల్స్ క్వాలిటీతో కనిపిస్తున్నాయి.  హాలీవుడ్ సినిమా సూపర్‌మెన్ మేకింగ్ చూసి యాక్షన్ రిగ్‌లను తయారుచేసుకొని ఆశ్చర్యపరిచారు. పర్‌ఫెక్ట్ ప్లానింగ్‌తో సినిమా చేశారు’ అని తెలిపారు.

రాజమౌళి, కీరవాణి జోక్యం చేసుకోలేదు

‘దర్శకుడు రితేష్ కథ చెబుతున్నప్పడే మేము ఎంజాయ్ చేశాను. సత్య పాత్ర సంభాషణలు చెప్పగానే మనసులో నవ్వుకున్నాం. థియేటర్‌లలో వాటికి చక్కటి స్పందన లభిస్తుందనే విశ్వాసం కలిగింది.  కథ విన్న తర్వాత సినిమా చేయమని చెప్పడానికి మాకు అవకాశం దొరకలేదు. శ్రీసింహా యమదొంగతో పాటు కొన్ని సినిమాల్లో నటించాడు. నటనలో చిన్నతనం నుంచి అతడిలో ఉన్న ఆసక్తిని చూశాం. దర్శకుడు రితేష్ ఈ సినిమాను నూతన హీరోతో చేయాలనే ఆలోచనలో ఉండటంతో కీరవాణి తనయుడు అని చెప్పకుండా శ్రీసింహా పేరును సూచించాం. ఆడిషన్స్ సమయంలో కొన్ని సన్నివేశాల్లో అభినయం కుదరకపోతే అరుణభిక్షుదగ్గర శిక్షణ తీసుకొన్నాడు. ఇందులో అతడి అభినయానికి ప్రశంసలు లభిస్తున్నాయి  కాలభైరవ  నేపథ్య సంగీతాన్ని ప్రశంసిస్తూ తొలి రోజు చాలా మంచి ఫోన్ చేశారు.  దర్శకుడితో పాటు మ్యూజిక్ డైరెక్టర్ ప్రతిభ వల్ల ఈ సినిమా ఆడుతుందనే  ప్రశంసలు  లభిస్తున్నాయి. కొత్త దర్శకుడు ఎలా  సినిమాను చేస్తాడో తెలియదు. సినిమా పరాజయం పాలైతే కుమారుల భవిష్యత్తుపై సందేహాలు వస్తాయి ఇలా ఎన్నో సంశయాలున్నా  కీరవాణిగారు మాపై నమ్మకంతో కథ వినకుండా శ్రీసింహా, కాలభైరవలను మాకు అప్పగించారు. సినిమా అయ్యేదాకా ఆయనతో పాటు వల్లి, రాజమౌళి ఎవరూ సినిమాలో జోక్యం  చేసుకోలేదు. ఫైనల్‌కాపీ చూసి సంతోషపడ్డారు. తనయుల అరంగేట్రానికి మంచి సినిమా దొరికిందనే సంతృప్తిగా ఫీలయ్యారు’ అని చెప్పుకొచ్చారు.

యంగ్‌ టాలెంటెడ్‌ను ప్రోత్సాహిస్తాం..

‘కథ బాగుంది సినిమా తీద్ధాం అని నిర్ణయం తీసుకోవడం తప్పితే సినిమాలో మా అఛీవ్‌మెంట్ ఏమీ లేదు. పూర్తి క్రెడిట్ దర్శకుడితో పాటు మిగతా చిత్రబృందానిదే. ఈ విజయం ఇచ్చిన స్ఫూర్తితో చిన్న సినిమాల్ని  ప్రోత్సహించే  ఆలోచనలో ఉన్నాం. కొత్త కథలు వింటున్నాం. ఔత్సాహికులైన నవతరం ఇండస్ట్రీకి వస్తేనే మంచి సినిమాలు వస్తాయి. నూతన తారాగణంతో సుకుమార్ రైటింగ్స్ భాగస్వామ్యంలో  ఉప్పెన సినిమాను తెరకెక్కిస్తున్నాం.  ఏప్రిల్‌లో సినిమాను విడుదలచేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. రెండు పాటలు బ్యాలెన్స్‌గా ఉన్నాయి. సుకుమార్ సినిమా చూసి అవుట్‌పుట్ బాగుందని మెచ్చుకున్నారు. విజయ్ సేతుపతితో పాటు  కొంతమంది నటులు మినహా మిగతా వారందరూ  కొత్తవాళ్లే సినిమాలో కనిపిస్తారు. భవిష్యత్‌లో మైత్రీ మూవీస్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు ఇలాంటి ప్రతిభావంతులైన యంగ్ టాలెంట్‌డ్‌ను ప్రోత్సాహించాలని నిర్ణయించుకున్నాం’ అని తెలిపారు.

News About Mathu Vadalara Success:

News About Mathu Vadalara Success  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ