‘ఏడు చేపల కథ’ లో టెంప్ట్ రవి గా నటించి ఒక్క టీజర్‌తోనే భారీ పాపులారిటీ సంపాదించిన హీరో అభిషేక్ రెడ్డి. ఈ మధ్యే ఆ సినిమా కూడా విడుదలై మంచి సక్సెస్ అయ్యింది. ఇప్పుడు మరో సినిమా తో అభిషేక్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తాజాగా అభిషేక్ నటించిన కొత్త సినిమా ‘వైఫ్ఐ’. ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. పావులర్ అయ్యింది. ఈ సినిమాలో గుంజన్.. ఫిదా గిల్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు, నూతన దర్శకుడు జీ.ఎస్.ఎస్.పీ కళ్యాణ్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. చిత్ర విడుదల సందర్భంగా యూనిట్ మీడియా సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా హీరో అభిషేక్ మాట్లాడుతూ.. జనవరి 3న విడుదల కానున్న వైఫ్ ఐ చిత్రం తప్పకుండా సక్సెస్ కానుంది. ఈ సినిమాను ప్రశాంత్ గౌడ్ గారు సార్ధక్ మూవీస్ ద్వారా విడుదల చేస్తున్నారు, అందుకు వారికి థాంక్స్ తెలువుతున్నాను. ఈ సినిమాకు మీ అందరి సపోర్ట్ కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
హీరోయిన్ గుంజన్ మాట్లాడుతూ.. తెలుగులో నేను చేస్తున్న మొదటి సినిమా ఇది. తెలుగులో డైలాగ్స్ నేర్చుకొని ఈ సినిమాలో చెప్పాను. నా పాత్ర మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. జనవరి 3న విడుదల కానున్న వైఫ్ఐ సినిమాను అందరూ సపోర్ట్ చెయ్యాలని కోరారు.
ఈ సందర్భంగా హీరో సూర్య మాట్లాడుతూ.. శేఖర్ గారికి అభిషేక్ గారికి థాంక్స్, నన్ను నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చారు. షూటింగ్ సమయంలో హీరో అభిషేక్ గారిలో మంచి నటుణ్ని చూశాను, అతని దగ్గర చాలా నేర్చుకున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత, దర్శకుడికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నారు
లిరిక్ రైటర్ రాంబాబు గోషాల మాట్లాడుతూ.. నేను రాసిన రెండు సాంగ్స్ బాగున్నాయి. నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ కళ్యాణ్ గారికి థాంక్స్, మల్టీ ట్యాలెంటెడ్ డైరెక్టర్ అతను, అలాగే వినోద్ యాజమాన్య నా కాంబినేషన్ లో వచ్చిన మరో హిట్ అల్బమ్ ఇది అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ వినోద్ యాజమాన్య మాట్లాడుతూ.. డైరెక్టర్ కళ్యాణ్ కు మంచి విజన్ ఉంది. అతను భవిషత్తులో మంచి డైరెక్టర్ అవుతాడు. సినిమా బాగా వచ్చింది తప్పకుండా మంచి సినిమా అవుతుంది అన్నారు