Advertisementt

పూరీకి మాటిచ్చిన పవన్ కల్యాణ్.. ఏంటిది!?

Sun 29th Dec 2019 09:12 AM
pawan-puri combo,powerstar pawan kalyan,puri jagannadh,pink remake  పూరీకి మాటిచ్చిన పవన్ కల్యాణ్.. ఏంటిది!?
News About Pawan-Puri Combo Movie!! పూరీకి మాటిచ్చిన పవన్ కల్యాణ్.. ఏంటిది!?
Advertisement
Ads by CJ

టాలీవుడ్‌లో ఒకప్పుడు తన ట్రెండ్‌తో పవర్ స్టార్‌గా ఎదిగిన పవన్ కల్యాణ్.. రీ ఎంట్రీ ఇచ్చేస్తున్నారని ‘పింక్’ రీమేక్‌‌తో మళ్లీ మేకప్ వేసుకుంటున్నారని గత కొన్నిరోజులు అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వస్తున్న పుకారు.!. అయితే అబ్బే అదేం పుకారు కాదని.. రీమేక్ షూటింగ్ జరుగుతోందని.. సినిమా బడ్జెట్, పవన్ రెమ్యునరేషన్‌ ఇదిగో అంటూ వార్తలు గుప్పుమంటున్నాయ్. అయితే ఇందులో నిజానిజాలెంటో తెలియడానికి ఇంతవరకూ పవన్ రియాక్ట్ అవ్వకపోవడంతో.. నిజమేనేమో అని పవన్, మెగాభిమానులు అనుకుంటున్నారు. 

ఇక అసలు విషయానికొస్తే.. అదేదో సామెత ఉంది కదా.. ‘ఆలూ లేదు సూలు లేదు...’ అన్నట్లుగా పింక్ సంగతేంటో ఇంకా పూర్తిగా తెలియరాలేదు కానీ.. ఇదిగో మరో సినిమా లైన్‌లో ఉందంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయ్. పవన్ కల్యాణ్ హీరోగా.. పూరి జగన్నాథ్ ఒక సినిమా చేయనున్నాడనేది ఆ పుకారు సారాంశం. అంతేకాదండోయ్.. ఆల్రెడీ పవన్‌తో పూరి భేటీ అయ్యి కథ కూడా చెప్పేశాడని.. కచ్చితంగా ఈ సినిమా చేద్దాం పూరీ అని మాటిచ్చాడని వార్తలు వస్తున్నాయ్. అయితే ఓ వైపు రోజుకు రోజుకు పుకార్లు ఎక్కువవుతుండటంతో మెగాభిమానుల్లో ఆందోళన నెలకొంది. అసలు ఏది నమ్మాలో.. ఏది లైట్ తీసుకోవాలో తెలియక అభిమానులు తికమకపడుతున్నారు.

వాస్తవానికి.. సూపర్‌స్టార్ మహేశ్ బాబు కోసం అనుకున్న ‘జనగణమన’ పవన్‌తో చేయాలని పూరీ ఎప్పట్నుంచో అనుకుంటున్నారట. అయితే ఇదే సరైన టైమ్ అని భావించి పవర్‌స్టార్‌తో భేటీ కావడం.. కథ వినిపించడం.. ఆయన ఒప్పుకోవడం అన్నీ చకచకా జరిగిపోయాయట. అయితే ఈ కాంబోలో నిజంగానే ఉందా..? ఒకవేళ ఉంటే జనగణమనే ఉంటుందా లేకుంటే మరోటేమైనా ఉంటుందా..? అసలు పవన్ రీ ఎంట్రీ ఎంతవరకూ నిజం..? అనే ప్రశ్నలు, అనుమానాలకు సమాధానం దొరకాలంటే పవన్ రియాక్ట్ అవ్వాల్సిందే మరి.

News About Pawan-Puri Combo Movie!!:

News About Pawan-Puri Combo Movie!!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ