Advertisementt

ఐ వాంట్ రెస్ట్ అంటున్న మహేశ్ బాబు!!

Sun 29th Dec 2019 09:10 AM
i want rest,superstar mahesh babu,mahesh tour,mahesh family  ఐ వాంట్ రెస్ట్ అంటున్న మహేశ్ బాబు!!
Yes.. I Want Rest Says Superstar Mahesh Babu! ఐ వాంట్ రెస్ట్ అంటున్న మహేశ్ బాబు!!
Advertisement
Ads by CJ

టాలీవుడ్ సూపర్‌స్టార మహేశ్ బాబు, రష్మిక మందన్నా నటీనటులుగా హిట్ చిత్రాల దర్శకుడిగా పేరుగాంచిన అనీల్ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాపై భారీగానే అంచనాలున్నాయ్. సరిలేరు ఇంకా రిలీజ్ కాకమునుపే మహేశ్‌తో నేనంటే నేనంటూ పలువురు డైరెక్టర్స్ కర్చీఫ్ వేసుకున్నారు. మరోవైపు ‘గీత గోవిందం’ డైరెక్టర్ పరుశురామ్ ఏకంగా అధికారికంగా ప్రకటన కూడా చేసేశారు. అయితే.. ఇవన్నీ పక్కనెడితే మహేశ్ మాత్రం ‘ఐ వాంట్ రెస్ట్ నౌ’ అంటున్నాడట.

సరిలేరు షూటింగ్ పూర్తయ్యింది.. ఇప్పుడు మహేశ్ చేసేదేమీ లేదు గనుక.. ఫ్యామిలీతో వెకేషన్‌కి సిద్ధమైనట్లు తెలుస్తోంది. భార్య, పిల్లలతో కలిసి త్వరలోనే వరల్డ్ టూర్‌కి వెళుతున్నారని వార్తలు గుప్పుమంటున్నాయ్. ‘మహర్షి’ సినిమా రిలీజ్‌కు ముందు టూర్‌కు వెళ్లిన మహేశ్ ఆ తర్వాత సరిలేరు సినిమా, ప్రకటనలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నాడు. అందుకే ఇక రెస్ట్ కావాలని ఫ్యామిలీతో విదేశాలకు వెళ్లాలని ఫిక్స్ అయ్యాడట. వాస్తవానికి మిగతా హీరోలతో పోలిస్తే.. మహేశ్ ఎంత బిజీగా ఉన్నప్పటికీ కుటుంబంతో గడపడానికి కొంత సమయం కేటాయిస్తారన్న విషయం తెలిసిందే.

Yes.. I Want Rest Says Superstar Mahesh Babu!:

Yes.. I Want Rest Says Superstar Mahesh Babu!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ