Advertisementt

‘జాత‌రో జాత‌రో ’ సాంగ్‌కు అమేజింగ్ రెస్పాన్స్..

Sat 28th Dec 2019 02:54 PM
jaatarojaatara,entha manchivaadavuraa,kalyanram,gopisundar,natasha  ‘జాత‌రో జాత‌రో ’ సాంగ్‌కు అమేజింగ్ రెస్పాన్స్..
Amazing Response For Entha Manchivaadavuraa Mass Song ‘జాత‌రో జాత‌రో ’ సాంగ్‌కు అమేజింగ్ రెస్పాన్స్..
Advertisement
Ads by CJ

నందమూరి క‌ల్యాణ్ రామ్ హీరోగా ‘శతమానం భవతి’ చిత్రంతో జాతీయ పురస్కారాన్నిగెలుచుకున్న సతీష్‌ వేగేశ్న ద‌ర్శకత్వంలో రూపొందుతోన్న ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘ఎంత‌మంచివాడ‌వురా’. ఆడియో రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న ఆదిత్యా మ్యూజిక్‌ సంస్థ తొలిసారిగా చిత్ర నిర్మాణ రంగంలోకి దిగి ఆదిత్యా మ్యూజిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దేవి మూవీస్‌ శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రానికి స‌మ‌ర్పకుడిగా వ్యవ‌హ‌రిస్తున్నారు.

నేష‌న‌ల్ అవార్డ్ విన్నర్ గోపీ సుంద‌ర్ సంగీత సార‌థ్యం వ‌హిస్తోన్న ఈ సినిమాలో రెండో సాంగ్ ‘జాత‌రో జాత‌ర‌..’ను శుక్రవారం చిత్ర యూనిట్ రెడ్ ఎఫ్‌.ఎంలో విడుద‌ల చేసింది. ఈ కార్యక్రమంలో హీరో నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌, ద‌ర్శకుడు స‌తీష్ వేగేశ్న, మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుంద‌ర్, సింగ‌ర్ రాహుల్ సిప్లిగంజ్ పాల్గొన్నారు. 

‘జాత‌రో జాత‌రో నేనొస్తే జాత‌రో ప‌రువాల మోత మోగ‌నీరో

పూత‌రో పూత‌రో బంగారు పూత‌రో నా మేని మెరుపు చూసుకోరో

ఊరోళ్ల కుర్రోళ్ల ఊర‌క చెప్పున‌మ్మో అస‌లైన పండ‌గేదో 

నిప్పులోన ప‌డ్డాకే నిగ్గు తేలున‌మ్మో సిసలైన పుత్త‌డేదో....’

అంటూ నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌, న‌టాషా దోషి మ‌ధ్య సాగే మాస్ బీట్ సాంగ్‌ను శుక్ర‌వారం రెడ్ ఎఫ్.ఎంలొ విడుద‌ల చేశారు. ఇప్పటికే విడుద‌ల చేసిన ‘అవునో తెలియ‌దు కాదో తెలియ‌దు..’ అనే మెలోడీ సాంగ్‌కు, టీజ‌ర్‌కు ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చాయి. ఇప్పుడు విడుద‌ల చేసిన మాస్ బీట్‌కు కూడా అమేజింగ్ రెస్పాన్స్ వ‌స్తోంది. శ్రీమ‌ణి సాహిత్యాన్ని అందించిన ఈ పాట‌ను బిగ్‌బాస్3 విన్నర్, సింగ‌ర్ రాహుల్ సిప్లిగంజ్‌, సాహితి చాగంటి ఆల‌పించారు. 

ప్ర‌స్తుతం ఈ సినిమా నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. అన్ని కార్యక్రమాల‌ను పూర్తి చేసి సినిమాను సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 15న విడుల చేస్తున్నారు. 

న‌టీన‌టులు :-

 నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌, మెహ‌రీన్‌, వి.కె.న‌రేశ్‌, సుహాసిని,శరత్‌బాబు,త‌నికెళ్ల భ‌ర‌ణి, ప‌విత్రా లోకేశ్‌, రాజీవ్ క‌న‌కాల‌, వెన్నెల కిశోర్‌, ప్ర‌వీణ్‌, ప్ర‌భాస్ శ్రీను త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు :-

రచన, ద‌ర్శ‌క‌త్వం: స‌తీశ్ వేగేశ్న‌

నిర్మాణం: ఆదిత్య మ్యూజిక్‌  (ఇండియా ) ప్రైవేట్‌ లిమిటెడ్‌

నిర్మాతలు ‌:  ఉమేష్‌ గుప్తా, సుభాష్ గుప్తా

సమర్పణ :శివలెంక కృష్ణ ప్రసాద్,

సినిమాటోగ్ర‌ఫీ: రాజ్ తోట‌

సంగీతం:  గోపీ సుంద‌ర్‌

ఎడిటింగ్‌: త‌మ్మిరాజు

ఆర్ట్‌:  రామాంజ‌నేయులు

ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్‌: ర‌షీద్ ఖాన్

Amazing Response For Entha Manchivaadavuraa Mass Song:

Amazing Response For Entha Manchivaadavuraa Mass Song

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ