నాగశౌర్య హీరోగా ఐరా క్రియేషన్స్ పతాకంపై రమణ తేజ దర్శకత్వంలో శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఉష ముల్పూరి నిర్మించిన చిత్రం ‘అశ్వథ్థామ’. ఈ కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్ ప్రపంచ వ్యాప్తంగా జనవరి 31న విడుదలవుతుంది. ఈ సినిమా టీజర్‌ని డిసెంబర్ 27న హైదరాబాద్ రామానాయుడు ప్రివ్యూ థియేటర్‌లో విడుదల చేశారు. ఉదయం 11గంటల 7 నిమిషాలకు హీరోయిన్ సమంత ట్విట్టర్‌లో ఈ టీజర్‌ను విడుల చేశారు. ఈ టీజర్ రిలీజ్ కార్యక్రమంలో హీరో నాగశౌర్య, సమర్పకుడు శంకర్ ప్రసాద్ ముల్పూరి, నిర్మాత ఉషా ముల్పూరి, లైన్ ప్రొడ్యూసర్ బుజ్జి, దర్శకుడు రమణ తేజ, సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకాల, ఎడిటర్ గ్యారీ, కెమెరామెన్ మనోజ్ రెడ్డి, బి.వి.యస్.రవి, ప్రముఖ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ తనయుడు యతీష్ పాల్గొన్నారు.
సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకాల మాట్లాడుతూ.. ‘యంగ్ టీమ్ అందరితో కలిసి చేసిన పవర్ ప్యాక్డ్ ఫిలిం ఇది. డిఫరెంట్ థ్రిల్లర్ జోనర్‌ను రమణ తేజ ఫెంటాస్టిక్గా ప్రెజెంట్ చేశాడు. టీజర్తో పటు మూవీ కూడా అందరికీ నచ్చుతుంది’అన్నారు.
ఎడిటర్ గ్యారీ మాట్లాడుతూ.. ‘శౌర్య కథని నమ్మి ప్రాణం పెట్టి ఈ సినిమా చేశాడు. ప్రతిదీ చాలా కేర్ తీసుకొని చేశాడు. డైరెక్టర్ తేజ కొత్త డైరెక్టర్‌లా కాకుండా అనుభవమున్న డైరెక్టర్‌లా వర్క్ చేశాడు. అలాగే నిర్మాత ఉష, శంకర్ ప్రసాద్‌గారు ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. తప్పకుండా ఈ చిత్రం అందర్నీ అలరిస్తుంది’అన్నారు.
కెమెరామెన్ మనోజ్ రెడ్డి మాట్లాడుతూ.. ‘శౌర్య కొత్త ఆలోచనతో ఈ కథని రాశారు. ఛాలెంజింగ్‌గా తీసుకొని ఈ సినిమా చేశాం. నిర్మాతలు ఫుల్ సపోర్ట్ చేశారు. టీమ్ అందరూ చాలా హార్డ్ వర్క్ చేశారు. తేజ అమేజింగ్ గా ఈ ఫిలిం తెరకెక్కించాడు. మూవీ చాలా బాగా వచ్చింది. డెఫినెట్ గా మా అందరికీ మంచిపేరు తెస్తుందని ఆశిస్తున్నాను’ అన్నారు.
యతీష్ మాట్లాడుతూ.. ‘టీజర్ చూస్తుంటే ప్రతి ఫ్రేమ్ చాలా ఇంట్రెస్టింగ్‌గా కనిపిస్తుంది. సినిమా థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ కలిగిస్తుంది. ప్రతి షాట్ లో టీమ్ వర్క్ కనిపిస్తుంది. ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి చేసిన ఈ సినిమా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదరుచూస్తున్నాం’ అన్నారు.
బి.వి.యస్. రవి మాట్లాడుతూ.. ‘హీరో కథ రాసుకోవడం ఒక విశిష్టత . టీజర్ చాలా గొప్పగా వుంది. మూవీ చాలా పెద్ద సక్సెస్ అవుతుంది. శ్రీ చరణ్ మ్యూజిక్ చాలా బాగుంది. శౌర్య డెడికేషన్‌తో హార్డ్ వర్క్ చేసి ఈ సినిమా చేశాడు. 24 గంటలు ఈ సినిమా కోసమే కష్టపడి పట్టుదలతో పెద్ద హిట్ కొట్టాలనే కసితో శౌర్య చేశాడు. తప్పకుండా హిట్ కొడతాడు అనే నమ్మకం వుంది’ అన్నారు.
చిత్ర దర్శకుడు రమణ తేజ మాట్లాడుతూ.. ‘నన్ను నమ్మి ఇంత భారీ సినిమాకి దర్శకత్వం చేసే అవకాశం ఇచ్చిన మా నిర్మాతలకు థాంక్స్. కంటెంట్ సినిమాలో కీలకంగా ఉంటుంది. శౌర్య ఐడియా చాలా బాగుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఈ చిత్రంలో వున్నాయి. నాగశౌర్య విశ్వరూపం ఈ చిత్రంలో చూస్తారు. అంత అద్భుతంగా నటించారు. ప్రతి సన్నివేశం థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఇలాంటి బిగ్ కమర్షియల్ మూవీ నాలాంటి కొత్త డైరెక్టర్ చేయడం ఛాలెంజింగ్ గా అనిపించింది. మనోజ్ బెస్ట్ విజువల్స్ ఇచ్చారు. శ్రీ చరణ్ మ్యూజిక్ అమేజింగ్. ఎడిటర్ గ్యారీ సెట్ కి వచ్చి ఆన్లైన్ ఎడిటింగ్ చేశాడు. సినిమా అందరికి నచ్చుతుంది’ అన్నారు.
చిత్ర సమర్పకులు శంకర్ ప్రసాద్ మూల్పూరి మాట్లాడుతూ.. ‘మా ఐరా క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మిస్తోన్న ప్రొడక్షన్ నంబర్ 3 చిత్రం అశ్వథ్థామ. కంటెంట్ ని నమ్మి ఈ సినిమా తీశాం. టీమ్ అంత కష్టపడి వర్క్ చేశారు. సినిమా బాగా వచ్చింది. మంచి హిట్ అవుతుందని నమ్మకం వుంది’అన్నారు.
నిర్మాత ఉషా మూల్పూరి మాట్లాడుతూ.. ‘ఇప్పటికే రిలీజ్ అయినా పోస్టర్స్, సాంగ్స్ కి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. టీజర్ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. మా టీమ్ అందరూ హార్డ్ వర్క్ చేసి ఈ సినిమా చేశారు. జనవరి 31న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నాం. తప్పకుండా మంచి విజయం సాదిస్తుంది’అన్నారు.
హీరో నాగ శౌర్య మాట్లాడుతూ .. ‘చలో టీజర్ ఇక్కడే రిలీజ్ చేశాం.. బ్లాక్ బస్టర్ అయింది. నర్తనశాల టీజర్ కూడా ఇదే ప్లేస్‌లో రిలీజ్ చేశాం. డిజాస్టర్ అయింది.. మరి ఇప్పుడు అశ్వథ్థామ టీజర్ రిలీజ్ చేస్తున్నాం. బ్లాక్ బస్టర్ అవుతుందని గర్వంగా చెప్పగలను. ఢిల్లీ, ముంబైలలో అమ్మాయిలపై జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ ఆధారంగా చేసుకొని ఈ చిత్రం కథను రాసుకున్నాను. ‘చలో’కి కథ రాశాను. కానీ పేరు వేసుకోలేదు. నాకు బేసిగ్గా కథలు రాయడం, చెప్పడం ఇష్టం. అమ్మాయిలకు రక్షణ లేదు అందరూ బాగుండాలి అని ఈ సినిమా తీశాం. నాకు లవర్ బాయ్ ఇమేజ్ అంటే చాలా చిరాకు.. దాని నుండి బయటికి వచ్చి రఫ్ గా వుండే క్యారెక్టర్ చేశాను. నాకు అలాగే ఉండటం ఇష్టం. మనోజ్ రెడ్డి నన్ను కొత్తగా చూపించాడు. నేను ఏదైతే కథ అనుకున్నానో దానిని చక్కగా తెరకెక్కించాడు..తేజ. ఈ సినిమాకి స్ట్రాంగెస్ట్ పిల్లర్ గ్యారీ. సెట్లో వుండి వర్క్ చేశాడు. తేజ, గ్యారీ, మనోజ్, నేను మేము నలుగురం 6నెలలు ట్రావెల్ చేసి ఈ కథపై వర్క్ చేశాం. అలా చేయడం వాళ్ళ వర్కింగ్ డేస్ చాలా తగ్గాయి. ఎలాంటి టెన్షన్ లేకుండా అనుకున్న టైంలోనే సినిమా పూర్తి చేశాం. శ్రీ చరణ్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఈ సినిమా తర్వాత పెద్ద కమర్షియల్ మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడు. ఫస్ట్ టైం కమర్షియల్ మూవీ చేస్తున్నాను. నా తల్లితండ్రులు గర్వంగా తలెత్తుకునేలా ఈ సినిమా చేశాను. ప్రేక్షకులకి తప్పకుండా సినిమా నచ్చుతుంది. మెహ్రీన్ చాలా అందంగా ఈ చిత్రంలో కనిపిస్తుంది. అలాగే ఒక కొత్త విలన్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. నేను ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఎగ్జయిట్ అవుతూ రాసిన విలన్ పాత్రలో జిషు నటించాడు. మంచి కథ రాశాను.. నచ్చింది.. సినిమా చేశాం. అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను’ అన్నారు.
నటీనటులు :-
నాగశౌర్య, మెహరీన్ తదితరులు
సాంకేతిక వర్గం:-
బ్యానర్: ఐరా క్రియేషన్స్
నిర్మాత: ఉషా ముల్పూరి
కథ: నాగశౌర్య
దర్శకత్వం: రమణతేజ
సినిమాటోగ్రఫీ: మనోజ్ రెడ్డి
సంగీతం: శ్రీచరణ్ పాకాల
ఎడిటర్: గ్యారీ బి.హెచ్
లైన్ ప్రొడ్యూసర్: బుజ్జి
డిజిటల్: ఎంఎన్ఎస్ గౌతమ్
డైలాగ్స్: పరుశురాం శ్రీనివాస్
యాక్షన్: అన్బరివు
కొరియోగ్రాఫర్: విశ్వ రఘు