‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రాల తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రం ‘అల.. వైకుంఠపురములో..’. ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ అయిపోగా ఫైనల్ టచ్ పనుల్లో ఉంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాకు సంబంధించిన సాంగ్స్ యూ ట్యూబ్‌ను షేక్ చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా ‘సామజవరగమణ’ సాంగ్ సౌతిండియాలోనే నంబర్‌వన్‌గా నిలవగా.. మరికొన్ని సాంగ్స్ కూడా మంచిగానే జనాల్లోకి వెళ్లాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు చాలా మంది ఈ సామాజవరగమణనే రింగ్‌టోన్‌లుగా కూడా పెట్టేసుకున్నారు. అలా.. సినిమా రిలీజ్ కాకమునుపే జనాల్లోకి గట్టిగానే వెళ్లడంతో ఇక సూపర్ డూపర్ హిట్టే అటు బన్నీ.. ఇటు త్రివిక్రమ్ అభిమానులు చెప్పుకుంటున్నారు. అయితే ఈ సినిమా గురించి తాజాగా ఓ ఆసక్తికర విషయం వెలుగుచూసింది. ఆసక్తికర అనడం కంటే కాంట్రవర్సీ అంటే ఇంకా బెటరేమో మరి.!
షూటింగ్ దాదాపు అయిపోవడంతో తుది మెరుగులు దిద్దే పనిలో చిత్రబృందం బిజిబిజీగా ఉంది. సినిమా రన్ టైమ్ విషయంలో హీరో వర్సెస్ డైరెక్టర్‌గా పరిస్థితులు మారాయని సమాచారం. సినిమా మొత్తం ఎడిటింగ్ చేసిన తర్వాత రన్ టైమ్ 3:05 గంటలు వచ్చిందని హీరో, నిర్మాతలకు త్రివిక్రమ్ చెప్పాడట. అయితే ఇదివరకే 2:45 గంటలు దాటిన ‘సైరా’, ‘సాహో’ లాంటి భారీ చిత్రాలకు డ్యూరేషన్ వల్ల మైనస్ అయ్యింది!. అందుకే మూడు గంటలు అస్సలు వద్దని బన్నీ పట్టుబట్టాడని తెలుస్తోంది. అయితే సినిమాలో హీరోయిజం మొదలుకుని కామెడీ, పంచ్‌లు, అన్నీ సరిగ్గా సెట్ అయిపోయాయని.. ఇక తీయడానికి ఏమీ లేదని.. తీయనని కూడా బన్నీకి చెప్పేశాడట.
ఈ విషయాన్ని బన్నీకి చెప్పడంతో సార్.. ఒకసారి కలిసి కూర్చోని చూద్దాం.. కట్ చేస్తేనే బెటర్ అని మాటల మాంత్రికుడితో చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఇక తానేం చేయడానికి లేదని.. మెల్లగా బంతిని బన్నీ కోర్టులో పడేశాడట త్రివిక్రమ్. ఫైనల్‌గా బన్నీ ఏం తేలుస్తాడో వేచి చూడాలి మరి. కాగా.. డిసెంబర్ 28న హైదరాబాద్‌లో, జనవరి 5న వైజాగ్‌లో ఈ సినిమాకు సంబంధించి రెండు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లను నిర్వహించడానికి చిత్రబృందం ఏర్పాటు పనుల్లో బిజిబిజీగా ఉంది.