‘RX100’ అనే సింగిల్ సినిమాతోనే కార్తికేయ క్రేజీ హీరోగా మారాడు. ఈ సినిమా ఆశించిన దానికంటే ఎక్కువగా కలెక్షన్ల వర్షం కురిపించడం.. సూపర్ డూపర్ హిట్టవ్వడంతో కుర్ర హీరో ఇక అవకాశాల కోసం స్టూడియోల చుట్టూ తిరగాల్సిన అక్కర్లేకుండా పోయింది. అంతేకాదు ఈ సినిమాతో కార్తికేయతో పాటు.. అటు పాయల్ రాజ్‌పుత్‌కు మంచి గుర్తింపు వచ్చింది.. ఇప్పుడు గట్టిగానే అవకాశాలు వస్తున్నాయ్. ఇవన్నీ అటుంచితే.. కార్తికేయ ఇటు రొమాంటిక్ సీన్స్‌లో గానీ లేదా అటు యాక్షన్ సీన్స్‌లకు సరిగ్గా సెట్ అవుతాడని ఈ సినిమాతో తేలిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే క్లాస్‌కు గానీ.. మాస్‌కు గానీ.. మరీ ముఖ్యంగా లవ్ సీన్స్‌లను పండించగలడని స్పష్టమైంది.
ఇప్పటికే నాని ఢీ కొట్టాడు!
ఓ వైపు హీరోగా రాణిస్తూనే ఈ ఏడాది నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలో విలన్‌గా నటించాడు. తాను హీరోగానే కాదు.. ఇదిగో ఇలా విలన్‌గా కూడా మెప్పిస్తానని ఈ సినిమాతో చాటి చెప్పుకున్నాడు. ఆ గెటప్.. ఆ వాక్ ఛాతుర్యం అన్నీ ఈ సినిమాలో విలన్‌గా చాలా బాగా ఆకట్టుకున్నాడు. అయితే.. అలా విలన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న కార్తికేయ హీరోగా అవకాశాలు వదలట్లేదు. ఇటీవలే 90 ఎంఎల్ అంటూ థియేటర్స్‌లోకి వచ్చి పర్లేదు అనిపించుకున్నాడు. ఇక హీరోయిజంకు కాస్త గ్యాప్ ఇచ్చి మళ్లీ విలనిజంలోకి కుర్ర హీరో దూకనున్నాడు. అది కూడా మన టాలీవుడ్ సినిమాలో కాదండోయ్.. కోలీవుడ్ సినిమాలో..!
స్టార్‌ను ఢీ కొట్టబోతున్నాడుగా!
తమిళ స్టార్ హీరో అజిత్ చిత్రంలో యంగ్ హీరో కార్తికేయ ప్రధాన విలన్ పాత్రను పోషిస్తున్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. అజిత్ హీరోగా.. హెచ్ వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో విలన్‌గా నటించాలని నిర్మాతలు కోరగా.. స్టార్ సరసన అనే సరికి ఏ మాత్రం ఆలోచించకుండా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. అంతేకాదు.. షూటింగ్ కోసం బల్క్ డేట్స్‌ను కేటాయించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అంటే.. స్టార్ హీరోను ఢీ కొట్టబోతున్నాడన్న మాట. వాస్తవానికి ఇప్పటికే టాలీవుడ్‌లో అటు హీరోగా.. ఇటు విలన్‌గా మెప్పించిన కార్తికేయ.. కోలీవుడ్‌లో ఇంతవరకూ సినిమా చేసింది లేదు. ఈ సినిమాతో తమిళంలో కూడా తనకంటూ ఓ మంచి గుర్తింపును తెచ్చుకోవచ్చని భావించిన కార్తికేయ ఒప్పుకున్నాడని తెలుస్తోంది. కాగా ఇది విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు మాత్రమే తెలిసింది కానీ.. అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ విషయంపై క్లారిటీ రావాలంటే.. అటు హెచ్ వినోద్ గానీ.. ఇటు కార్తికేయ గానీ రియాక్ట్ అయితే తెలిసేలా ఉంది.