‘మా’ టీవీలో ప్రసారమైన ‘కలర్స్’ అనే ప్రోగ్రామ్ ద్వారా బుల్లితెర నుంచి వెండితెరకు పరిచయమైన స్వాతి అతి తక్కువ కాలంలోనే తనకంటూ టాలీవుడ్‌లో మార్కెట్ క్రియేట్ చేసుకుంది. తొలుత డబ్బింగ్ ఆర్టిస్టుగా, ఆ తర్వాత సింగర్‌గా, హీరోయిన్‌గా మారిన ఈ బ్యూటీ పెళ్లి తర్వాత సినిమాల్లో కనిపించలేదు. ఇన్ని రోజులు సినిమాల్లో ఎంజాయ్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. పెళ్లయిన తర్వాత లైఫ్‌ను తెగ ఎంజాయ్ చేసింది. ఇక మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్న ఈ భామ.. ఇది వరకే తాను నటించిన సినిమాకు సీక్వెల్‌తో టాలీవుడ్ సినీ ప్రియులను అలరించాలని భావిస్తున్నట్లు సమాచారం.
కుర్ర హీరో నిఖిల్, కలర్స్ స్వాతి నటీనటులుగా చందూ మొండేటి తెరకెక్కించిన చిత్రం ‘కార్తికేయ’. ఈ చిత్రం అప్పట్లో భారీ విజయాన్నే సొంతం చేసుకుంది. ఈ సినిమాతో దర్శకుడు, నిఖిల్‌కు మంచి గుర్తింపు తెచ్చింది. అంతేకాదు.. నిఖిల్ సినీ కెరీర్‌లో ఇదో చెప్పుకోదగ్గ చిత్రంగా మిగలగా.. స్వాతికి మరింత ‘కలర్స్’ పెరిగాయ్!. అంటే సినిమా అవకాశాలు గట్టిగానే వచ్చాయని అర్థం. ఈ సినిమాలో స్వాతి డాక్టర్‌గా నటించి మెప్పించిన ఈ భామ ఇదే సినిమా సీక్వెల్‌తో రీ ఇంట్రీ ఇస్తోంది. ఇందుకు సంబంధించిన సన్నాహాలు ప్రస్తుతం జరుగుతున్నాయని తెలుస్తోంది.
‘అర్జున్ సురవరం’ మంచి హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఇదే ఊపు మీద మరో సినిమా తీసేయాలని భావిస్తున్న నిఖిల్‌కు సీక్వెల్ థాట్ వచ్చిందట. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా డైరెక్టర్‌ను సంప్రదించాడట. ఈ సినిమాలో స్వాతిని తీసుకోవాల్సిందేనని పట్టుబట్టాడట. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్- వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే షూటింగ్ ప్రారంభించాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారట. కాగా.. ఈ సినిమాకు మెయిన్ హీరోయిన్‌గా అనుపరమేశ్వరన్ సంప్రదించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఇక స్వాతి మాత్రం న్యూస్ రిపోర్టర్‌గా కనిపించనుందని సమాచారం. అంటే అప్పుడు డాక్టర్.. ఇప్పుడు రిపోర్టర్ అన్న మాట. ఇందుకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.