Advertisementt

రజనీకాంత్ ‘దర్బార్’ నుంచి పెళ్లి పాట వచ్చేసింది!

Fri 27th Dec 2019 06:53 PM
wedding song,dumm dumm,rajinikanth,darbar  రజనీకాంత్ ‘దర్బార్’ నుంచి పెళ్లి పాట వచ్చేసింది!
Wedding song ‘Dumm Dumm’ from Rajinikanth’s ‘Darbar’ released రజనీకాంత్ ‘దర్బార్’ నుంచి పెళ్లి పాట వచ్చేసింది!
Advertisement
Ads by CJ

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, స్టార్‌ దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న తొలి సినిమా ‘దర్బార్‌’. లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై భారీ నిర్మాణ వ్యయంతో, అత్యున్నత సాంకేతిక విలువలతో ఎ. సుభాస్కరన్‌ నిర్మిస్తున్నారు. యువ సంగీత సంచలనం అనిరుధ్ రవిచంద్రన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. తెలుగులో ప్రముఖ నిర్మాత ఎన్వీ ప్రసాద్‌ విడుదల చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 9న సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో రజనీ ఇంట్రడక్షన్ సాంగ్ ‘దుమ్ము ధూళి’ విడుదలైంది. యూట్యూబ్‌లో మిలియన్ వ్యూస్‌తో దూసుకువెళుతూ రికార్డులు సృష్టిస్తోంది. ఆ పాటను అనంత శ్రీరామ్ రాయగా.. ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆలపించారు. సినిమాలో మరో పాట, పెళ్లి నేపథ్యంలో వచ్చే ఎనర్జిటిక్ సాంగ్ ‘డుమ్ డుమ్’ను కృష్ణకాంత్ రాశారు. ఈరోజు ఆ పాటను విడుదల చేశారు. విడుదలైన కొన్ని క్షణాల లో ఈ పాట వైరల్ అయింది. ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది.

ఈ సందర్భంగా గేయ రచయిత కృష్ణకాంత్ (కేకే) మాట్లాడుతూ.. ‘సూపర్ స్టార్ రజనీకాంత్ గారి సినిమాలో పాట రాసే అవకాశం నాకు ఇంత త్వరగా వస్తుందని ఊహించలేదు. నాకు ఇంకా ఇది ఒక కలలా ఉంది. అనిరుధ్ రవిచంద్రన్ గారు సంగీతం అందించిన సూర్య ‘గ్యాంగ్’, నాని ‘జెర్సీ’ సినిమాల్లో అన్ని పాటలు రాశాను. అనిరుధ్ గారు నన్ను గుర్తుపెట్టుకుని.. ఈ సినిమాలో ఒక పాట రాయమని ఇచ్చారు. చిన్నప్పటి నుండి రజనీకాంత్ గారిని చూస్తూ పెరిగిన నాకు.. ఆయన సినిమాలో పాట రాసే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. సినిమాలో ఒక యువ జంటకు పెళ్ళయ్యే సందర్భంలో ఈ ‘డుమ్ డుమ్’ పాట వస్తుంది. పెళ్లికి ముందు, తర్వాత భార్యభర్తలు ఎలా ఉంటారు? అని చిన్న పిలాసఫీతో సాగే గీతం ఇది. రజినీకాంత్ గారి పాటల్లో ఎక్కువ ఫిలాసఫీ ఉంటుంది. తమిళంలో ఈ పాటను వివేక్ గారు రాశారు. ఆ పాటను నాకు పంపించారు. తెలుగులో ఈ పాటను మీరు రాయలని చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను. దర్శకుడు మురుగదాస్ గారు తీసిన ‘గజినీ’, ‘కత్తి’, ‘తుపాకీ’ సినిమాలు నాకు చాలా ఇష్టం. నా అభిమాన దర్శకుల్లో ఆయన ఒకరు. రజనీకాంత్ గారు, మురుగదాస్ కాంబినేషన్‌లో వస్తున్న తమిళ్ సినిమాలో నాకు ఒక పాట రాసే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఎనర్జిటిక్ మ్యారేజ్ సాంగ్ ను నకాష్ అజీజ్  పాడారు. రజనీ గారి ఎనర్జీకి ఆ వాయిస్ బాగా సూట్ అయింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన అనిరుధ్ రవిచంద్రన్, రజనీకాంత్, మురుగదాస్, చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌కి థాంక్స్. పాటను హిట్ చేసినట్టు జనవరి 9న విడుదల అవుతున్న సినిమాను హిట్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

రజనీకాంత్ సరసన కథానాయికగా నయనతార, రజనీకాంత్ కుమార్తెగా నివేదా థామస్, ఇతర కీలక పాత్రల్లో సునీల్ శెట్టి తంబీ రామయ్య, యోగి బాబు, ప్రతీక్ బబ్బర్, నవాబ్ షా తదితరులు  నటిస్తున్న ఈ చిత్రానికి పి.ఆర్‌.ఓ:  సురేంద్ర నాయుడు- ఫ‌ణి కందుకూరి, బి.ఎ.రాజు, స్టంట్ కొరియోగ్రఫీ: పీటర్ హెయిన్, రామ్-లక్ష్మణ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సుందర్ రాజ్, పాటలు: అనంత శ్రీరామ్, కృష్ణకాంత్ (కేకే), సినిమాటోగ్రఫీ: స‌ంతోష్ శివ‌న్‌, మ్యూజిక్: అనిరుద్ ర‌వి చంద్రన్, ఎడిట‌ర్: శ్రీ‌క‌ర్ ప్ర‌సాద్, నిర్మాత: ఎ.సుభాస్కరన్, ద‌ర్శక‌త్వం: ఎ.ఆర్. మురుగదాస్‌.

Wedding song ‘Dumm Dumm’ from Rajinikanth’s ‘Darbar’ released:

Wedding song ‘Dumm Dumm’ from Rajinikanth’s ‘Darbar’ released  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ