ప్రముఖ వ్యాపారవేత్త, పార్లమెంట్ సభ్యుడు జయదేవ్ గల్లా తనయుడు అశోక్ గల్లా హీరోగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలోఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. అమర్‌రాజా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై పద్మావతి గల్లా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో నరేశ్, సత్య, అర్చనా సౌందర్య ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పుడు ఈ చిత్రంలో విలక్షణ నటుడు జగపతిబాబు కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. జగపతిబాబు రోల్‌కు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ సినిమా తొలి షెడ్యూల్ పూర్తయ్యింది. రెండో షెడ్యూల్ శుక్రవారం నుంచి హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. జిబ్రాన్ సంగీతం.. రిచర్డ్ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. చంద్రశేఖర్ రావిపాటి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
నటీనటులు :-
అశోక్ గల్లా, నిధి అగర్వాల్, జగపతిబాబు, నరేశ్, సత్య, అర్చనా సౌందర్య తదితరులు
సాంకేతిక నిపుణులు :-
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శ్రీరామ్ ఆదిత్య
నిర్మాత: పద్మావతి గల్లా
బ్యానర్: అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్
ఎగ్జికూటివ్ ప్రొడ్యూసర్: చంద్రశేఖర్ రావిపాటి
మ్యూజిక్: జిబ్రాన్
సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ప్రసాద్
ఆర్ట్:ఎ.రామాంజనేయులు
ఎడిటర్: ప్రవీణ్ పూడి
డైలాగ్స్: కల్యాణ్ శంకర్, ఎ.ఆర్.ఠాగూర్
కాస్ట్యూమ్స్:అక్షయ్ త్యాగి, రాజేష్
పి.ఆర్.ఒ: బి.ఎ.రాజు, వంశీ-శేఖర్