‘ఏడు చేపల కథ’ లో టెంప్ట్ రవిగా నటించి ఒక్క టీజర్‌తోనే భారీ పాపులారిటీ సంపాదించిన హీరో అభిషేక్ రెడ్డి. ఈ మధ్యే ఆ సినిమా కూడా విడుదలై మంచి సక్సెస్ అయ్యింది. ఇప్పుడు మరో సినిమాతో అభిషేక్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తాజాగా అభిషేక్ నటించిన కొత్త సినిమా ‘వైఫ్ఐ’. ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. పావులర్ అయ్యింది. ఈ సినిమాలో గుంజన్.. ఫిదా గిల్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు, నూతన దర్శకుడు జీ.ఎస్.ఎస్.పీ కళ్యాణ్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు.
వరల్డ్ వైడ్‌గా జనవరి 3న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ సార్ధక్ మూవీస్ సొంతం చేసుకుంది. నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్ ప్రశాంత్ గౌడ్ ‘వైఫ్ ఐ’ చిత్రాన్ని శ్రీ సార్ధక్ మూవీస్ ద్వారా వరల్డ్ వైడ్ విడుదల చేయబోతున్నారు. ‘వైఫ్ ఐ’ అంటే కేవలం భార్య భర్తలే కాదు.. ఈ జనరేషన్ ప్రతీ అమ్మాయి, అబ్బాయి చూడదగ్గ సినిమాగా ఈ ‘వైఫ్ ఐ’ ని తీర్చిదిద్దారు దర్శకులు జి.ఎస్.ఎస్.పి కళ్యాణ్.