Advertisementt

రష్మిక మందన్నా క్రేజ్‌ను వాడుకుంటున్న హీరో!!

Thu 26th Dec 2019 11:18 AM
rashmika mandanna,craze,athade sriman narayana,rakshith setty  రష్మిక మందన్నా క్రేజ్‌ను వాడుకుంటున్న హీరో!!
Hero Used Rashmika mandanna Craze! రష్మిక మందన్నా క్రేజ్‌ను వాడుకుంటున్న హీరో!!
Advertisement
Ads by CJ

కన్నడలో రష్మిక-రక్షిత్ శెట్టిలు ‘కిర్రాక్ పార్టీ’తో సక్సెస్ ఫుల్‌గా హీరోహీరోయిన్స్‌గా టాప్ లెవల్లోకి వెళ్లడమే కాకుండా.. వారిద్దరూ ఆ సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడడం, వెంటనే ఇద్దరికీ ఎంగేజ్మెంట్ జరగడం ఇలా అన్నీ చకచకా జరిగిపోయాయి. తర్వాత రష్మిక తెలుగులోకి హిట్ సినిమాతో ఎంట్రీ ఇవ్వడంతో. తర్వాత బ్లాక్ బస్టర్ హీరోయిన్ అవడంతో రష్మిక ప్రియుడు రక్షిత్‌తో బ్రేకప్ చేసుకుని అతనికి దూరమైంది. గతం గతః అన్న రేంజ్‌లో రష్మిక కెరీర్‌లో దూసుకుపోతోంది. ఇక రక్షిత్ శెట్టి కూడా కన్నడలో సినిమాలు చేసుకుంటున్నాడు. తాజాగా.. ‘అతడే శ్రీమన్నారాయణ’ సినిమాతో టాలీవడ్‌లోకి రాబోతున్నాడు రక్షిత్. పలు భాషలో విడుదలవుతున్న ‘అతడే శ్రీమన్నారాయణ’ సినిమాకి తెలుగులో మాత్రం భారీ ప్రమోషన్స్ చేస్తున్నాడు.

అయితే టాలీవడ్‌లో తన మాజీ ప్రియురాలి రష్మిక సక్సెస్ ఫుల్ క్రేజ్‌ని ఆయుధంగా వాడుకుంటున్నాడు. రష్మికతో తన బంధం బ్రేకప్ ఎలా అయ్యిందో అంటూ అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి కూడా చెప్పేస్తూ తన సినిమాపై క్రేజ్ పెంచుకుంటున్నాడు. మాములుగానే టాప్ హీరోయిన్ రష్మిక మాజీ బాయ్ ఫ్రెండ్ అనగానే అందరిలో క్యూరియాసిటీ ఉంటుంది. ఇక రష్మికతో తనకున్న ప్రేమ, బ్రేకప్, ఫ్రెండ్‌షిప్ గురించి మాట్లాడితే సినిమా మీద మరింత ఇంట్రెస్ట్ పెంచొచ్చు.. అదే ఇక్కడ రక్షిత్ శెట్టి ప్లాన్. అందులో భాగంగానే రష్మిక ఇపుడు కెరీర్‌లో ముందుకు వెళ్తోంది. తనతో బ్రేకప్ విషయాలను కెలికి మరీ ఆమెని ఇబ్బంది పెట్టొద్దు అంటూ వగలు పోతున్నాడు. మరి రష్మిక క్రేజ్ వాడుకుంటున్న రక్షిత్ శెట్టికి ‘అతడే శ్రీమన్నారాయణ’ జనవరి 1 న ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి.

Hero Used Rashmika mandanna Craze!:

Hero Used Rashmika mandanna Craze!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ