Advertisementt

బన్నీతో పని లేదంటున్న సుక్కు!

Wed 25th Dec 2019 10:04 PM
interesting news,bunny-sukku movie,shooting,kerala,sukumar  బన్నీతో పని లేదంటున్న సుక్కు!
Interesting News About Bunny-Sukku movie బన్నీతో పని లేదంటున్న సుక్కు!
Advertisement
Ads by CJ

‘రంగస్థలం’ సినిమాకి వచ్చిన ఫిలిం‌ఫేర్ అవార్డ్స్‌తో సుకుమార్ ఫుల్ ఖుషీగా ఉన్నాడు. నెంబరాఫ్ కేటగిరీస్‌లో ‘రంగస్థలం’ ఫిలింఫేర్ అవార్డ్స్‌ని ఎగరేసుకుపోయింది. ఇక సుకుమార్ రంగస్థలం తర్వాత అల్లు అర్జున్‌తో సినిమా మొదలుపెట్టాడు. ‘రంగస్థలం’ వచ్చిన ఏడాదిన్నర గ్యాప్‌తో అల్లు అర్జున్ సినిమాతో సెట్స్ మీదకెళ్ళాడు సుక్కు. ఎర్రచందనం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమా ఈ మధ్యనే పూజా కార్యక్రాలతో మొదలైంది. అయితే అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురంలో..’ షూటింగ్‌తో బిజీగా ఉండడంతో సుకుమార్... అల్లు అర్జున్ అవసరం లేని కొన్ని సీన్స్‌ని చిత్రీకరణ చేస్తున్నాడు. ఇప్పటికే లొకేషన్స్‌ని ఫైనల్ చేసుకున్న సుక్కు.. అల్లు అర్జున్ లేకుండా కొంతమేర షూటింగ్ చేసేశాడు.

కేర‌ళ‌లోని ద‌ట్టమైన అడ‌వుల మ‌ధ్య.. ఓ జ‌ల‌పాతం నేప‌థ్యంలో ఒక చక్కటి సీన్‌ని సుకుమార్ చిత్రీకరించాడట. ఆ సినిమా షాట్ సూపర్‌గా వచ్చిందని, బన్నీ లేకుండా తీసిన ఆ సన్నివేశంలో.. బ‌న్నీ పై బ్లూ మ్యాట్‌లో షాట్ తీసి, దాన్ని సీజీ స‌హాయంతో క‌వ‌ర్ చేస్తారని తెలిసింది. అయితే ఈ సన్నివేశంతోనే అల్లు అర్జున్ ఇంట్రెడెక్షన్ సీన్ ఉండబోతోందని.. పీట‌ర్ హెయిన్స్ ఈ స‌న్నివేశానికి యాక్షన్ కొరియోగ్రఫీ అందించినట్లుగా సమాచారం. ఇక ఈ జలపాతం సీన్ సినిమా హైలెట్స్‌లో ఒకటిగా ఉండబోతోందని.. ఇక బన్నీ వచ్చేలోపు సుకుమార్, బన్నీతో అవసరం లేని షూటింగ్ సీన్స్ కంప్లీట్ చేస్తాడని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది.

Interesting News About Bunny-Sukku movie:

Interesting News About Bunny-Sukku movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ