‘చిత్రలహరి’ సూపర్ హిట్ తరువాత సుప్రీమ్ హీరో సాయి తేజ్ హీరోగా, హ్యాట్రిక్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో, బన్నీవాస్ నిర్మాతగా, గ్లామర్ డాల్ రాశి ఖన్నా హీరోయిన్‌గా రూపొందిన చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. శుక్రవారం (డిసెంబర్ 20న) ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు పాజిటీవ్ రెస్పాన్స్ లభించమే కాకుండా హౌస్ ఫుల్స్ అవుతున్నాయి.
ఇటీవల ప్రతిరోజు పండగే సినిమాపై యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ‘ప్రతిరోజు పండగే సక్సెస్ సాధించడంపై తేజ్, మారుతి, జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్‌కు మనస్పూర్తిగా అభినందనలు’ అంటూ ప్రభాస్ తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. తాజాగా రామ్ చరణ్ ఈ సినిమాపై స్పందిస్తూ.. ‘ప్రతిరోజు పండగే చిత్రం మోరల్ వ్యాల్యూస్‌తో కూడిన చిత్రం, తప్పకుండా అందరూ చూడదగ్గ సినిమా, మంచి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాయి తేజ్, మారుతి, తమన్, రాశి ఖన్నా ఇతర చిత్ర యూనిట్ సభ్యులకు అభినందనలు’ అని తన ఫేస్ బుక్ వేదికగా వెల్లడించాడు.